స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ దాచిన కేసులో అనిల్ అంబానీకి ఐటీ నోటీసులు, రూ.420 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు

By Krishna AdithyaFirst Published Aug 24, 2022, 11:49 AM IST
Highlights

అడాగ్ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి బ్యాడ్ టైం ఇంకా అంతం కావడం లేదు. ఇప్పుడు అనిల్ అంబానీపై బ్లాక్ మనీ విషయంలో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అనుమతి కోరింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రూ.814 కోట్లకు పైగా ఉన్న అప్రకటిత ఆస్తులపై రూ.420 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఈ డిమాండ్ చేసింది.

రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్య డబ్బును ఉంచినందుకు అనిల్ అంబానీకి ఐటి శాఖ ప్రాసిక్యూషన్ నోటీసు జారీ చేసింది. దీంతో పాటు రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రూ.814 కోట్లకు పైగా అప్రకటిత డబ్బు ఉన్న కేసులో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీని బ్లాక్ మనీ చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ రూ.420 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించింది .

63 ఏళ్ల అంబానీ పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఆ శాఖ ఆరోపించింది, అతను "ఉద్దేశపూర్వకంగా" తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను, ఆర్థిక ప్రయోజనాలను భారతీయ పన్ను అధికారులకు వెల్లడించలేదని పేర్కొంది.

ఈ కేసులో అంబానీకి ఈ నెల ప్రారంభంలో షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీని బ్లాక్ మనీ (బహిర్గతం కాని విదేశీ ఆదాయం. ఆస్తులు) పన్ను చట్టం 2015లోని సెక్షన్ 50, 51 కింద విచారించవచ్చని, ఇది గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా పడే వీలుందని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ వ్యవహారంపై ఆగస్టు 31లోగా సమాధానం ఇవ్వాలని అనిల్‌ అంబానీని ఆదేశించింది.ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, అనిల్ అంబానీ 2012-13 నుండి 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరాల మధ్య విదేశీ బ్యాంకుల్లో అప్రకటిత ఆస్తులను ఉంచడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు.

ఇదిలా ఉంటే అనిల్ అంబానీకి జారీ చేసిన నోటీసులో ఆదాయపు పన్ను శాఖ ఆగస్టు 31లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ విషయమై అనిల్ అంబానీ కార్యాలయాన్ని పీటీఐ వార్తా సంస్థ సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు. 2012-13 (AY13) మదింపు సంవత్సరం నుండి 2019-20 (AY20) వరకు విదేశాల్లో ఉంచిన అప్రకటిత ఆస్తులపై పన్ను ఎగవేసినట్లు అంబానీపై ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ నోటీసు ప్రకారం, బహామాస్‌కు చెందిన డైమండ్ ట్రస్ట్, నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్‌లిమిటెడ్‌లకు అంబానీ అనఫీయల్ యజమాని విచారణలో తేలింది. నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్‌లిమిటెడ్ పన్ను ఎగవేతలకు స్వర్గధామమైన బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నమోదు చేసి ఉంది.

ఆదాయపు పన్ను శాఖ ఈ వివరాలను వెల్లడించింది
 ఆదాయపు పన్ను శాఖ విచారణలో బహామాస్ ఆధారిత ట్రస్ట్ , డ్రీమ్‌వర్క్ హోల్డింగ్స్ ఇంక్ అనే కంపెనీని నడుపుతున్నట్లు కనుగొంది. ఈ కంపెనీ స్విస్ బ్యాంకులో ఒక ఖాతాను తెరిచింది, దీనిలో డిసెంబర్ 31, 2017న 32,095,600 డాలర్లను డిపాజిట్ చేసింది. నోటీసు ప్రకారం, ట్రస్ట్ 25,040,422 డాలర్లు ప్రారంభ నిధులను పొందింది. ఈ నిధులు అనిల్ అంబానీ వ్యక్తిగత ఖాతా నుంచి పంపినట్లు ఆ శాఖ చెబుతోంది. 2006లో ట్రస్ట్‌ను తెరవడానికి KYCసమయంలో అంబానీ తన పాస్‌పోర్ట్‌ను ఇచ్చారు. 

అనిల్ అంబానీ కోట్లాది పన్నులు కట్టాల్సి వస్తుంది
అదే సమయంలో, జూలై 2010లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ జ్యూరిచ్ బ్యాంక్ ఆఫ్ సైప్రస్‌లో కూడా ఖాతాను తెరిచింది. ఈ కంపెనీకి మరియు కంపెనీ నిధులకు అనిల్ అంబానీ అంతిమ ప్రయోజనదారుడని గుర్తించింది. ఈ కంపెనీ 2012లో బహామాస్‌లో రిజిస్టర్ అయిన PUSA నుండి 100 మిలియన్ డాలర్లను అందుకుంది. అనిల్ అంబానీ ఆ డబ్బులకు యజమాని అని తేల్చింది.  రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ. 814 కోట్లు కాగా, దీనిపై రూ.420 కోట్ల పన్ను బకాయి ఏర్పడిందని పన్ను అధికారులు తెలిపారు.

click me!