మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా.. ? అయితే ఈ విధంగా తెలుసుకోండి..

By Sandra Ashok Kumar  |  First Published Sep 11, 2020, 1:38 PM IST

 పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయాలంటూ  ప్రభుత్వం చెబుతున్నా విషయం మీకు తెలిసిందే. ఇందుకోసం గడువు కూడా పోదించింది. ఆదాయపు పన్ను దాఖలు గడువు సమయం దగ్గర పడుతుండటంతో మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారో  లేదా  ఈ విధంగా నిర్ధారించుకొండి. 


 న్యూ ఢీల్లీ: గత కొంత కాలంగా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయాలంటూ  ప్రభుత్వం చెబుతున్నా విషయం మీకు తెలిసిందే. ఇందుకోసం గడువు కూడా పోదించింది. ఆదాయపు పన్ను దాఖలు గడువు సమయం దగ్గర పడుతుండటంతో మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారో  లేదా  ఈ విధంగా నిర్ధారించుకొండి.

ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటిఆర్) దాఖలు చేయడంతో పాటు కొత్త పాన్ పొందటానికి ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 AA (2) ప్రకారం పాన్ ఉన్న, ఆధార్ పొందటానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు  ఆధార్ నంబర్‌ను పన్ను అధికారులకు తెలియజేయాలి.

Latest Videos

undefined

మీరు ఒకవేళ ఇప్పటికే మీ ఆధార్ నంబర్‌ను మీ పాన్‌ కార్డుతో లింక్ చేసి ఉంటే, మీరు ఆన్‌లైన్‌ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా కేవలం ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌  https://www.incometaxindiaefiling.gov.in/home ఓపెన్ చేయండి


వెబ్‌సైట్‌ ఎడమ వైపు పైన, మీకు "లింక్ ఆధార్" అనే ఆప్షన్ పై ఉంటుంది దాని పై క్లిక్ చేయండి. 

 పాన్ బాక్స్ పైభాగంలో మీరు ఇప్పటికే లింక్ ఆధార్ రిక్వేస్ట్ సమర్పించినట్లయితే, దాని స్టేటస్ చూసుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది.


ఆప్షన్ ఎంచుకోండి

మీకు రెండు ఆప్షన్ చూయిస్తుంది

1. మీ పాన్ వివరాలను ఫిల్ చేయండి 

2. మీ ఆధార్ వివరాలను ఫిల్ చేయండి


మీ ఆధార్, పాన్ లింక్ అయితే  మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.


సంవత్సరానికి రూ.5 లక్షల కన్నా తక్కువ సంపాదించేవారు, 80 ఏళ్లు పైబడిన వారు తప్ప మిగతా వారందరికీ ఐటిఆర్ ఇ-ఫైలింగ్ తప్పనిసరి. అందువల్ల మీరు ఇంకా మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, మీరు ముందస్తుగా ఎలా చేసుకోవాల్సి ఉంటుంది.

click me!