IRCTC Tour Package: వేసవి సెలవల్లో సిమ్లా మంచు కొండల్లో కేవలం రూ. 35 వేలకే టూర్..పూర్తి వివరాలు మీకోసం..

By team teluguFirst Published May 7, 2022, 4:02 PM IST
Highlights

IRCTC Himachal Hills And Valleys: వేసవి సెలవుల్లో మీరు సిమ్లాలో పర్యటించాలని అనుకుంటున్నారా, అయితే భారతీయ రైల్వే సంస్థ అయిన IRCTC ప్రత్యేకంగా సిమ్లా టూర్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు సిమ్లాతో పాటు కులు, మనాలి లాంటి ప్రదేశాలను సైతం విజిట్ చేసే వీలు కల్పిస్తోంది. 

IRCTC Himachal Hills And Valleys: వేసవి సెలవులు అనగానే హిల్ స్టేషన్స్ లో వెకేషన్ చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది  దేశంలోని అన్ని చోట్లా విపరీతమైన వేడి ఉంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందడానికి చల్లటి పర్వత ప్రాంతాలను విజిట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మీరు జూన్ నెలలో హిమాచల్‌లోని సిమ్లా మరియు మనాలిని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు IRCTC HIMACHAL HILLS AND VALLEYS టూరు ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాకేజీలో, మీరు హైదరాబాద్ నుండి చండీగఢ్, మనాలి, సిమ్లాకు ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

ఈ వేసవి కాలంలో మంచు కొండల్లో ఆస్వాదించడం కోసం భారతీయ రైల్వే సంస్థ అందిస్తున్న IRCTC హిమాచల్ చండీగఢ్ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంది. IRCTC HIMACHAL HILLS AND VALLEYS పేరుతో పిలిచే   ఈ ప్యాకేజీ ప్రత్యేకతలు, అలాగే ఎంత ఫీజు వసూలు చేస్తారు. ఏమేం చూపిస్తారో తెలుసుకుందాం. 

IRCTC Himachal Tour: హిమాచల్ పర్యటన వివరాలు ఇవే..
>> ఈ పర్యటన మే 15 నుండి ప్రారంభమవుతుంది, మే 23న ముగుస్తుంది.
>> ప్యాకేజీ 7 Nights/8 Days ఉంటుంది. 
>> ఈ టూర్‌లో ముందుగా ప్రయాణీకులు హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు విమానంలో వెళ్తారు.
>> ఆ తర్వాత మీరు చండీగఢ్ నుండి సిమ్లాకు వెళతారు.
>> రాత్రిపూట అక్కడే హోటల్‌లో బస చేస్తారు.
>> దీని తర్వాత మీరు రెండవ రోజు సిమ్లాను సందర్శిస్తారు.
>> తర్వాత అక్కడి నుంచి బస్సులో మనాలి వెళ్తారు.
>> మనాలిలో మీరు హిడింబా టెంపుల్, మను టెంపుల్, వశిష్ట టెంపుల్ బాత్, వాన్ విహార్, టిబెటన్ మొనాస్టరీ, క్లబ్ హౌస్ వంటి ప్రదేశాలను చూస్తారు.
>> దీని తర్వాత మీరు సోలాంగ్ వ్యాలీలో కూడా ప్రయాణం చేస్తారు.
>> దీని తర్వాత మనాలి నుంచి చండీగఢ్ వస్తారు.
>> అప్పుడు మీరు చండీగఢ్ నుండి హైదరాబాద్ కు విమానంలో తిరిగి వస్తారు.
>> మే 23న లక్నోలో మీ ప్రయాణం ముగుస్తుంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సౌకర్యాలు IRCTC హిమాచల్ టూర్ ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి-
>> ఈ ప్యాకేజీలో, ప్రయాణీకులు విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే అవకాశం పొందుతారు.
>> మీరు ప్రతి టూరిస్టు ప్లేసుకు వెళ్లే సమయంలో  బస్సు లేదా క్యాబ్ సౌకర్యం పొందుతారు.
>> ప్రయాణికులకు ప్రతిరోజూ అల్పాహారం రాత్రి భోజన సౌకర్యం లభిస్తుంది.
>> మీకు ప్రయాణంలో టూర్ గైడ్ అందుబాటులో ఉంటారు.
>> ప్రయాణీకులకు ప్రయాణ బీమా సౌకర్యం లభిస్తుంది.
>> మీరు ప్రతిచోటా రాత్రిపూట బస చేయడానికి హోటల్ సౌకర్యం కూడా పొందుతారు.
>> ప్యాకేజీని పొందడానికి ఈ రుసుమును చెల్లించండి-
>> ఒంటరిగా ప్రయాణించాలంటే రూ.52,200 చెల్లించాలి.
>> అదే సమయంలో, కపుల్ కు మాత్రం ఒక్కొక్కరికి రూ.37,950 రుసుము చెల్లించాలి.
>> ఫ్యామిలీలో ముగ్గురు వెళితే  రూ.35,850 చొప్పున ముగ్గురు వ్యక్తులకు చెల్లించాల్సి ఉంటుంది.
>> పిల్లలకు ప్రత్యేక రుసుము చెల్లించాలి.

click me!