IPO : ఈ వారం 3 ఐపీవోలు ఓపెన్ అయ్యేందుకు సిద్దం...మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలంటే..?

Published : Sep 03, 2023, 07:03 PM IST
IPO : ఈ వారం 3 ఐపీవోలు ఓపెన్ అయ్యేందుకు సిద్దం...మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలంటే..?

సారాంశం

ఐపీఓ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా. ఆగస్టు నెలలో లిస్ట్ అయినటువంటి ఐపీఓ లలో దాదాపు అన్ని పెద్ద ఐపివోలు కూడా ఇన్వెస్టర్లకు లాభాలను అందించాయి. ఇటీవల లిస్ట్ అయినటువంటి Aeroflex Industries ఐపిఓ ఏకంగా 89% లిస్టింగ్ లాభాలు అందించింది. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లో తెరుచుకోనున్న ఐపిఓ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

ఈ వారం, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం మూడు IPO పబ్లిక్ ఆఫర్‌లు తెరుచుకోనున్నాయి. వీటిలో రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ లిమిటెడ్, జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్, EMS లిమిటెడ్ ఉన్నాయి. ఈ మూడు కంపెనీల IPOల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (Ratnaveer Precision Engineering Limited IPO)
రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఈ IPO ద్వారా రూ.165.03 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇన్వెస్టర్లు ఈ IPO కోసం సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 14న స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ కానున్నాయి. కంపెనీ ఇష్యూ ధరను రూ. 93-రూ. 98గా నిర్ణయించారు. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ అంటే 150 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు IPO అధిక ధర బ్యాండ్ ప్రకారం రూ. 98కి 1 లాట్ కోసం దరఖాస్తు చేస్తే, మీరు రూ. 14,700 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. . రత్నవీర్ ప్రెసిషన్  IPO కోసం, రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్‌లకు, అంటే 1950 షేర్లకు బిడ్డింగ్ వేయవచ్చు.  ఈ కంపెనీ గుజరాత్‌లోని నాలుగు తయారీ యూనిట్ల ద్వారా తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ ఫినిషింగ్ షీట్లు, ఫినిషింగ్ మెషీన్లు, సోలార్ మౌంటు హుక్స్, పైపులు, ట్యూబ్‌లను తయారు చేస్తుంది. ఇది కాకుండా, కంపెనీ ఆటోమోటివ్, సోలార్ పవర్, విండ్ పవర్, పవర్ ప్లాంట్లు, ఇతర వస్తువుల కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తుంది.

జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్ (Jupiter Life Line Hospitals IPO )
జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్ ఈ IPO ద్వారా రూ. 869.08 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ IPO కోసం సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 18న స్టాక్ మార్కెట్లోలో లిస్ట్ అవుతాయి కంపెనీ IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 695-రూ. 735గా నిర్ణయించింది. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్, అంటే 20 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు IPO గరిష్ట ధర బ్యాండ్ ప్రకారం రూ. 735 వద్ద 1 లాట్ కోసం దరఖాస్తు చేయాలంటే, మీరు కనీసం రూ. 14,700 పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా 13 లాట్‌లకు అంటే 260 షేర్లకు బిడ్డింగ్ వేయవచ్చు.  జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్ ముంబై మెట్రోపాలిటన్ ఏరియా (MMR), థానే, పూణే, ఇండోర్‌లలో 'జూపిటర్' బ్రాండ్‌తో మూడు ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. మూడు ఆసుపత్రుల మొత్తం ఆసుపత్రి సామర్థ్యం 1,194 బెడ్లు కావడం విశేషం. 

EMS లిమిటెడ్ (EMS Limited IPO)
EMS లిమిటెడ్ IPO ద్వారా రూ. 321.24 కోట్లను సేకరిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ IPO కోసం సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 21న  స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ కానున్నాయి.  కంపెనీ ఇంకా IPO ధర బ్యాండ్‌ను వెల్లడించలేదు. త్వరలో కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను విడుదల చేస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్