నిమిషాల్లోనే 10 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో మార్కెట్స్..

By Sumanth KanukulaFirst Published Dec 20, 2021, 11:05 AM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసులు (Omicron cases) భారీ స్థాయిలో పెరగడం.. ఆందోళనకర వార్తలు బయటకు వస్తుండటంతో మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే రూ.10 లక్షల కోట్లకు పైగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. 

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసులు (Omicron cases) భారీ స్థాయిలో పెరగడం.. ఆందోళనకర వార్తలు బయటకు వస్తుండటంతో మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే రూ.10 లక్షల కోట్లకు పైగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత సూచీలు కుప్పకూలాయి.ఈ క్రమంలోనే  సెన్సెక్స్ 1,098 పాయింట్లు నష్టపోయి 55,912 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు పతనమై 16,661 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ప్రారంభ ట్రేడ్‌లో బిఎస్‌ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ రూ. 10.47 లక్షల కోట్లు తగ్గి రూ. 253.56 లక్షల కోట్లకు చేరుకుంది. క్రితం సెషన్‌లో మార్కెట్ క్యాప్ రూ. 264.03 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత సెనెక్స్ మరో 300 పాయింట్లు పతనం అయింది. ఉదయం 10:15 గంటలకు సెన్సెక్స్ 282 పాయింట్లు నష్టపోయి 55,729 వద్ద, నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయి 16,592 వద్ద ఉన్నాయి.

click me!