
మార్చి 31వ తేదీతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల భారం దాదాపు రెండింతలు పెరిగి 119 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ప్రధానంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా ఎగిశాయి. ఓ సమయంలో 140 డాలర్లు కూడా క్రాస్ చేశాయి. ప్రస్తుతం 110 డాలర్లకు సమీపంలో ఉన్నాయి. ప్రపంచంలోనే భారత్ చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో అతిపెద్దది. ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు అంటే వరకు 119.2 బిలియన్ డాలర్ల చమురు దిగుమతి కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 62.2 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.
మార్చిలో ఎక్కువ
కేవలం మార్చి నెలలోనే చమురు దిగుమతుల కోసం 13.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేయవలసి వచ్చింది. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది మార్చి నెలలో కేవలం 8.4 బిలియన్ డాలర్ల చమురు మాత్రమే దిగుమతి అయింది. జనవరి నుండి చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రారంభంలో 100 డాలర్లకు పెరిగి, ఆ తర్వాత 140 డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం 110 డాలర్లకు దగ్గరగా ఉన్నాయి.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(PPAC) ప్రకారం.. భారత క్రూడ్ దిగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 212.2 మిలియన్ టన్నులుగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 196.5 మిలియన్ టన్నులు. కరోనా ముందు నాటి 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చినా ఈ దిగుమతులు 227 మిలియన్ టన్నులకు పెరిగాయి. దిగుమతి చేసుకున్న ముడి చమురును పెట్రోల్, డీజిల్ వంటి వ్యాల్యూ యాడెడ్ ఉత్పత్తులాగ మారుస్తారు.
దిగుమతుల వాటా అధికం
భారత్ వినియోగించే చమురులో 85.5 శాతం వాటా దిగుమతులదే. భారత్ మిగులు శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొన్ని పెట్రోలియం ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. అయితే సౌదీ అరేబియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే వంట గ్యాస్ ఎల్పీజీ ఉత్పత్తి తక్కువగా ఉంది. దేశంలో 2021-22లో 202.7 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు వినియోగించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 194.3 మిలియన్ టన్నులుగా ఉంది. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019-20లోని 214.1 మిలియన్ టన్నులతో పోలిస్తే మాత్రం తక్కువ