హాంకాంగ్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరణ..

By Ashok kumar Sandra  |  First Published Jan 23, 2024, 9:46 AM IST

భారతదేశ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 5న మొదటిసారిగా $4 ట్రిలియన్లను దాటింది, అందులో సగం గత నాలుగేళ్లలో వచ్చినవే.


హాంకాంగ్‌ను భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూల్చింది. బ్లూమ్‌బెర్గ్ సేకరించిన డేటా ప్రకారం, భారత ఎక్స్ఛేంజీలలో లిస్ట్  చేయబడిన షేర్ల విలువ సోమవారం ముగింపు నాటికి $4.33 ట్రిలియన్‌లకు చేరుకుని, హాంకాంగ్‌ $4.29 ట్రిలియన్లను అధిగమించింది, దింతో బ్లూమ్‌బెర్గ్  డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా నిలిచింది. 

స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 5న మొదటిసారిగా $4 ట్రిలియన్‌లను దాటింది, అందులో దాదాపు సగం గత నాలుగు సంవత్సరాలలో వచ్చినవే. 

Latest Videos

ముంబైలోని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఆశిష్ గుప్తా బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ, “వృద్ధి వేగాన్ని మరింతగా సెట్ చేయడానికి భారతదేశంలో అన్ని సరైన ఇంగ్రిడిఎంట్స్  ఉన్నాయి అని అన్నారు. 

హాంకాంగ్ పడిపోవడానికి  చైనా నిర్ణయాలు  కూడా కారణం. చైనా  అత్యంత ప్రభావవంతమైన ఇంకా  వినూత్నమైన కొన్ని సంస్థలు హాంకాంగ్‌లో లిస్ట్ చేయబడ్డాయి. బీజింగ్  కఠినమైన యాంటీ-కోవిడ్ -19 నియంత్రణలు, కార్పొరేషన్లపై రేగులేటరీ  అణిచివేతలు, ప్రాపర్టీ-సెక్టార్ సంక్షోభం, పశ్చిమ దేశాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చైనీస్ స్టాక్‌లను తీవ్రంగా దెబ్బతీశాయి. 

చైనీస్ అండ్ హాంకాంగ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ 2021లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుండి $6 ట్రిలియన్లకు పైగా పడిపోయింది. హాంకాంగ్‌లో కొత్త లిస్టులు డ్రై అయిపోయాయి, ఆసియా ఆర్థిక కేంద్రం ఇనీషియల్ పబ్లిక్  ఆఫరింగ్స్ కోసం ప్రపంచంలోని అత్యంత రద్దీ వేదికలలో ఒకటిగా దాని హోదాను కోల్పోయింది. .
 
2023లో ఓవర్సీస్ ఫండ్స్ భారతీయ షేర్లలోకి $21 బిలియన్లకు పైగా కుమ్మరించాయి, దీనితో  దేశం బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్ వరుసగా ఎనిమిదో సంవత్సరం లాభాలను పొందేందుకు సహాయపడింది.

"భారతదేశం అత్యుత్తమ దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశం అని స్పష్టమైన ఏకాభిప్రాయం ఉంది" అని Guillaume Jaisson అండ్ Peter Oppenheimer సహా గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ ఇంక్. వ్యూహకర్తలు సంస్థ  గ్లోబల్ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ నుండి జరిపిన సర్వే ఫలితాలతో జనవరి 16న ఒక నోట్‌లో రాశారు. 

click me!