ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్...అరుణ్ జైట్లీ

By sivanagaprasad KodatiFirst Published Aug 30, 2018, 2:56 PM IST
Highlights

వచ్చే ఏడాదికల్లా భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ఈ ఏడాది భారత్, ఫ్రాన్స్‌ను అధిగమించిందని వచ్చే ఏడాది బ్రిటన్‌ను అధిగమిస్తుందని తెలిపారు.

వచ్చే ఏడాదికల్లా భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ఈ ఏడాది భారత్, ఫ్రాన్స్‌ను అధిగమించిందని వచ్చే ఏడాది బ్రిటన్‌ను అధిగమిస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడంలో ఎలాంటి సందేహం లేదని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. 

ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలే తక్కువ వృద్ధి రేటుతో కొనసాగుతున్నాయని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాబోయే పది, ఇరవై సంవత్సరాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన చేరుతుందన్నారు. మరోవైపు రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరుగుతుందన్నారు. 

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక విధానాల రూపకల్పనలో పేరొందిన ఎన్‌సీఏఈఆర్‌ పునరుద్ఘాటించిందని తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం సమసిపోతున్న సంకేతాలతో భారత్‌ వృద్ధి రేటు ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసిందన్నారు.

click me!