
2025–26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఏడు ITR ఫారాలను (ITR-1 నుండి ITR-7 వరకు) ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. వీటిలో ITR-V, కొత్తగా విడుదల చేసిన ITR-U ఫారం కూడా ఉన్నాయి. ఈ ఫారాలు ఇప్పుడు అధికారిక పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఫైలింగ్ కి అవసరమైన ఇ-ఫైలింగ్ యుటిలిటీస్ ఇంకా యాక్టివేట్ కాలేదు.
ఎవరైనా తమ ఆదాయాన్ని గవర్నమెంట్ కి తెలియజేయడానికి ఉపయోగించే సాధనాలను ఇ-ఫైలింగ్ యుటిలిటీస్ అంటారు. ఇవి సాధారణంగా మూడు రూపాల్లో ఉంటాయి.
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇవి యాక్టివేట్ అయ్యే వరకు ట్యాక్స్ ఫైలింగ్ చేయడం సాధ్యం కాదు.
ఈ సంవత్సరం కొత్తగా ITR-U ఫారం ప్రవేశపెట్టారు. ఇది మే 19న ప్రారంభించారు. ఇది పన్ను చెల్లింపుదారులను 48 నెలల వరకు ఆదాయపు పన్ను రాబడిని దాఖలు చేయడానికి లేదా సవరించడానికి అనుమతిస్తుంది. ఈ ఫారం గతంలో ట్యాక్స్ పే చేయని వారికి, చేసిన దాంట్లో తప్పులు చేసిన వారికి కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రస్తుతానికి ట్యాక్స్ ఫైలింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ మీరు ముందుగానే అన్నింటినీ సిద్ధం చేసుకోవచ్చు. అవేంటే..
1. మీ ఆదాయ వనరులు, వృత్తి, నివాస స్థితి ఆధారంగా సరైన ITR ఫారాన్ని గుర్తించి ప్రింట్ తీసి పెట్టుకోండి.
2. మీ వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం(TIS)లను మీ ఫైనాన్షియల్ రికార్డులతో పోల్చి చూసుకోండి.
మూలధన లాభాలు, ఇతర ఆదాయ వనరులు, క్రిప్టో పెట్టుబడులు లాంటివి ఉన్నవారు వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.