సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు.. వీల్‌చైర్‌పై ప్రత్యేక వ్యాన్‌లో హాజరైన రతన్ టాటా తల్లి, ప్రముఖులు..

Published : Sep 07, 2022, 01:39 PM IST
సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు.. వీల్‌చైర్‌పై  ప్రత్యేక వ్యాన్‌లో హాజరైన రతన్ టాటా తల్లి, ప్రముఖులు..

సారాంశం

టాటా గ్రూప్‌కు చెందిన మరే ఇతర సీనియర్ అధికారులు అంత్యక్రియల్లో కనిపించలేదు. టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో  సైరస్ మిస్త్రీ  ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరైన మధు కన్నన్ అంత్యక్రియలలో పాల్గొన్నారు.

ముంబై: ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ భౌతికకాయానికి మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. సెంట్రల్ ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలకు పార్సీ కమ్యూనిటీకి చెందిన సభ్యులు, కొంతమంది వ్యాపార నాయకులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

అలాగే పరిశ్రమ ప్రముఖుడు రతన్ టాటా తల్లి(Stepmother) 92 ఏళ్ల సిమోన్ టాటా వీల్‌చైర్‌పై  ప్రత్యేక వ్యాన్‌లో శ్మశానవాటికకు చేరుకోగా, అంత్యక్రియలకు టీసీఎస్ మాజీ హెడ్ ఎస్ రామదొరై కూడా వచ్చారు.అయితే, టాటా గ్రూప్‌కు చెందిన మరే ఇతర సీనియర్ అధికారులు అంత్యక్రియల్లో కనిపించలేదు. టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో  సైరస్ మిస్త్రీ  ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరైన మధు కన్నన్ అంత్యక్రియలలో పాల్గొన్నారు.

సైరస్ మిస్త్రీ అన్నయ్య షాపూర్ మిస్త్రీ, మామ ఇంకా సీనియర్ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్‌చంద్, దీపక్ పరేఖ్, విశాల్ కంపానీ, రోనీ స్క్రూవాలా, ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్, ఎన్‌సిపి లీడర్ సుప్రియా సూలే, గణేష్ నాయక్, మాజీ కాంగ్రెస్ ఎం‌పి  మిలింద్ దేవరా శ్మశానవాటికకు హాజరయ్యారు.

తెల్లటి పూలతో అలంకరించిన సైరస్ మిస్త్రీ మృతదేహాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆసుపత్రి నుండి ఉదయం శ్మశానవాటికకు తీసుకొచ్చారు. అయితే మంగళవారం మధ్యాహ్నానికి ముందు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హాజరైన వారి ప్రకారం అంత్యక్రియలు జరగడానికి ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ఆచార ప్రార్ధనలు నిర్వహించారు. శ్మశానవాటిక లోనికి మీడియాని అనుమతించలేదు. 

2012-16 నుండి సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ కాంగ్లోమరేట్ టాటా సన్స్‌కు నాయకత్వం వహించిన సైరస్ మిస్త్రీ (54), అతని స్నేహితుడు జహంగీర్ పండోలే ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రముఖ గైనకాలజిస్ట్ అనహిత పండోలె (55), ఆమె భర్త డారియస్ పండోల్ (60) గాయపడి ముంబైలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సైరస్ మిస్త్రీ కుటుంబం సంతాప సందర్శనలను అందించవద్దని అభ్యర్థనతో సైరస్ మిస్త్రీ మరణాన్ని, దహన సంస్కారాల సమయాన్ని ప్రకటిస్తూ ఉదయం పత్రికలలో ప్రకటనలు విడుదల చేసింది.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు