ట్విట్టర్ బ్లూటిక్ పెయిడ్ సర్వీస్ అమలు, ట్వీట్ పరిమితి 4000 పదాలకి పెంపు...మస్క్ సంచలన నిర్ణయం

By Krishna AdithyaFirst Published Dec 13, 2022, 10:52 AM IST
Highlights

ఫేక్ అకౌంట్ల బెడదను అరికట్టేందుకు ట్విట్టర్ కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వాధినేతలు, జర్నలిస్టుల అసలైన ఖాతాలను వెరిఫై చేసి బ్లూటిక్ ఇస్తుంది. ఈ బ్లూటిక్ నిజమైన ఖాతా మరియు నకిలీ ఖాతా మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది.

ఎట్టకేలకు ట్విట్టర్ తన యూజర్లకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత బ్లూ టిక్ సేవను అందించాలని నిర్ణయించింది. బ్లూటిక్ పొందడానికి, వినియోగదారులు నెలకు సుమారు 8 డాలర్లు (660 రూ.) చెల్లించాలి , ఐఫోన్ వినియోగదారులు నెలకు 11 డాలర్లు (908 రూ.) చెల్లించాలి. దీనితో పాటు, ఈ సబ్‌స్క్రైబర్‌కు తక్కువ ప్రకటనలు, వీడియో ప్రసారానికి ఎక్కువ సమయం వంటి ఇతర సౌకర్యాలు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

నకిలీ ఖాతాల బెడదను నియంత్రించేందుకు, కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ పెద్దలు, జర్నలిస్టుల నిజమైన ఖాతాలను ధృవీకరించడానికి ట్విట్టర్ బ్లూటిక్ ఇస్తుంది. ఈ బ్లూటిక్ నిజమైన ఖాతా , నకిలీ ఖాతా మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను రూ.3.6 లక్షల కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత, బ్లూటిక్ పొందడానికి వెరిఫైడ్ యూజర్స్ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అయితే పలువురు స్కామర్లు 8 డాలర్లు చెల్లించి నకిలీ ఖాతాలకు బ్లూటిక్ పొంది. అసలైన వారి పేరిట ట్వీట్లు చేసి, పలు దిగ్గజ సంస్థలకు నష్టం కలిగించారు. దీంతో బ్లూటిక్ పెయిడ్ సర్వీసును ఆపాల్సి వచ్చింది. 

ట్వీట్ వర్డ్ లిమిట్ 280 నుంచి 4000కి పెంపు
ట్విటర్ టేకోవర్ చేసిన తర్వాత చాలా మార్పులు చేసిన ఎలోన్ మస్క్.. ట్వీట్ల పద పరిమితిని 280 నుంచి 4000కి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రిపోర్టులపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎలోన్ మస్క్ అవును, వర్డ్ పరిమితిని 4000కి పెంచబోతున్నాం అని బదులిచ్చారు. అయితే దీనిపై నెటిజన్లు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంత సుదీర్ఘంగా రాయడానికి అనుమతిస్తే, అది చమత్కారమైన వెబ్‌సైట్ కాదని, ఒక వ్యాసం అవుతుందని చమత్కరించాడు. అంతేకాకుండా, ఇంత సుదీర్ఘమైన ట్వీట్లలో ప్రధాన అంశం కూడా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ.. నవంబర్ 29 నుంచి కొత్త బ్లూటిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ ప్రకటించారు. నవంబర్ 29న, వెరిఫైడ్ ఖాతాలకు బ్లూటిక్స్ ఇచ్చే విధానాన్ని ట్విట్టర్ మళ్లీ ప్రవేశపెడుతోంది. ఈ సమయంలో, బ్లూటిక్ అందుకున్న వినియోగదారులు తమ ఖాతా పేరును మార్చుకుంటే, ట్విట్టర్ కొత్త పేరును ధృవీకరించే వరకు బ్లూటిక్‌ను కోల్పోతారని ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే నేటి నుంచి అమలు చేస్తున్నారు. 

దీనికి ముందు, నవంబర్‌లో మీడియా నివేదికలు ట్విట్టర్ బ్లూటిక్ ఖాతాదారులకు నెలవారీ రుసుము రూ. 719గా నిర్ణయించబడే అవకాశం ఉందని, ఇది వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. ట్విట్టర్ ఇటీవల కొన్ని అధునాతన పాశ్చాత్య దేశాలలో బ్లూటిక్ ఖాతాదారులకు 7.99 డాలర్ల నెలవారీ రుసుమును అమలు చేసింది. దీని తర్వాత, వచ్చే నెలలో భారతీయులపై కూడా వసూలు చేయనున్నట్లు ట్విట్టర్ కొత్త యజమాని ఎలోన్ మస్క్ తెలిపారు.

click me!