కేవలం గంటలోనే కరోనా సోకిందా లేదో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే !

Ashok Kumar   | Asianet News
Published : Jul 25, 2020, 10:43 PM IST
కేవలం గంటలోనే కరోనా సోకిందా లేదో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే !

సారాంశం

 ఒక గంటలో కోవిడ్ -19 సంక్రమణను గుర్తించడానికి నమూనాలను పరీక్షించగలదు. మరో విషయం ఏంటంటే  పరీక్ష ఫలితాలు కోవిడ్ పాజిటివ్ లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ ను  స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా రోగి మొబైల్‌కు పంపుతుంది. 

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటి ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుల బృందం పోర్టబుల్ రాపిడ్ డయాగ్నొస్టిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది, ఇది ఒక గంటలో కోవిడ్ -19 సంక్రమణను గుర్తించడానికి నమూనాలను పరీక్షించగలదు. మరో విషయం ఏంటంటే  పరీక్ష ఫలితాలు కోవిడ్ పాజిటివ్ లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ ను  స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా రోగి మొబైల్‌కు పంపుతుంది.

మార్కెట్-రెడీ మెషీన్ లను  ఇన్స్టిట్యూట్లో ఆవిష్కరించారు, ఐఐటి ఇప్పటికే ఈ మెషీన్ కోసం  పేటెంట్ దాఖలు చేసింది, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది అని ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ప్రతి యంత్రానికి సుమారు 2000 రూపాయలు ఖర్చవుతుందని, అయితే దీన్ని భారీ ఉత్పత్తితో తగ్గించవచ్చు.

సాధారణంగా ఆర్టీ-పిసిఆర్ మెషిన కోసం రూ .15 లక్షలు ఖర్చవుతుంది, అయితే పరీక్ష కోసం మాత్రం రూ .2000 - 2500 ఖర్చవుతుంది. ఈ సందర్భంగా ఖరగ్‌పూర్‌లోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ సుమన్‌ చక్రవర్తి మాట్లాడుతూ ఈ డివైజ్‌తో పూల్‌ టెస్టింగ్‌ సాధ్యమని, ఒకే పోర్టబుల్ యూనిట్‌ను పెద్ద సంఖ్యలో టెస్టుల కోసం ఉపయోగింవచ్చని, ప్రతి టెస్ట్‌ తర్వాత పేపర్‌ కార్ట్రిడ్జ్‌ని మార్చడం ద్వారా ప్రతి గంటకు పది విభిన్న నమూనాలను పరిశీలించవచ్చని తెలిపారు.

also read ఒప్పో నుండి లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే ? ...

సౌరశక్తి, బ్యాటరీతో అత్యంత తక్కువ వనరులతో సుదూర ప్రాంతాల్లోనూ ఈ కొత్త పరికరాన్ని వినియోగించేలా రూపొందించినట్లు చెప్పారు. శిక్షణ లేని వ్యక్తులు సైతం ఆపరేట్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

‘నమూనాలు - నాసోపారేంజీల్‌, స్వాబ్‌ సేకరించిన తర్వాత యంత్రం నిర్వహించడానికి చాలా ఉపయోగమని, ఎలాంటి శిక్షణ అవసరం లేని వ్యక్తులు ఆపరేట్‌ చేయవచ్చని, హిందీ, బెంగాలీ భాషల్లో తయారు చేసిన సూచనలను చదవడం ద్వారా మాత్రమే ఆపరేట్ చేయవచ్చు’  ఐఐటీ స్కూల్ ఆఫ్ బయోసైన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అరిందమ్ మొండల్ పేర్కొన్నారు.

ఇనిస్టిట్యూట్‌ మార్కెట్ రెడీ పరికరాన్ని అభివృద్ధి చేసిందని, ఇప్పుడు వాణిజ్యం చేసి ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రభుత్వం, వాణిజ్య సంస్థల సహకారం కోరుతున్నట్లు  పరిశోధకులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Investment: రిటైర్ అయ్యాక ఎవ‌రిపై ఆధార‌ప‌డొద్దా.? ఇలా చేస్తే.. మీ అకౌంట్‌లోకి నెల‌కు రూ. ల‌క్ష ప‌క్కా
Business Idea: ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియా.. స‌క్సెస్ అయితే పేప‌ర్‌లో మీ పేరు రావ‌డం ఖాయం