కోల్‌కతాలో ఐ‌ఐ‌ఎం‌సి‌ఏ‌ఏ కనెక్షన్ల సమావేశం.. ఐ‌ఎఫ్‌ఎఫ్‌సి‌ఓ ఐ‌ఐ‌ఎం‌సి‌ఏ‌ఏ అవార్డును అందుకున్న హెల్త్ సెక్రెటరీ

By S Ashok KumarFirst Published Mar 9, 2021, 5:13 PM IST
Highlights

ఈ  అసోసియేషన్ ‘పబ్లిక్ సర్వీస్’కు ఐ‌ఎఫ్‌ఎఫ్‌సి‌ఓ ఐ‌ఐ‌ఎం‌సి‌ఏ‌ఏ అవార్డును  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి డాక్టర్ సౌమిత్ర మోహన్‌కు ప్రదానం చేసింది. 

కోల్‌కతా / గువహతి: ఐఐఎంసి  అలుమిని  అసోసియేషన్ పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్  కోల్‌కతా ఇంకా  గువహతిలో ‘కనెక్ష  2021’ను నిర్వహించాయి.  ఈ  అసోసియేషన్ ‘పబ్లిక్ సర్వీస్’కు ఐ‌ఎఫ్‌ఎఫ్‌సి‌ఓ ఐ‌ఐ‌ఎం‌సి‌ఏ‌ఏ అవార్డును  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి డాక్టర్ సౌమిత్ర మోహన్‌కు ప్రదానం చేసింది.

డాక్టర్ మోహన్ బెంగాల్‌లో కోవిడ్-19 నిర్వహణకు సంబంధించిన   వాటికి వ్యవహరిస్తున్నాడు. కోల్‌కతాలోని సిల్వర్ జూబ్లీ (1995-96) బ్యాచ్ పూర్వ విద్యార్థులు ప్రేమ్ ప్రకాష్, మధు పాస్వాన్, ప్రమోద్ కుమార్‌లను కూడా అసోసియేషన్ సత్కరించింది.

ఈ కోల్‌కతా కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ చాప్టర్ అధ్యక్షుడు సుభ్రో నియోగి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సుబీర్ భౌమిక్, సుబీర్ ఘోష్, ఆసిస్ చక్రవర్తి, స్నేహశిష్ సుర్, రాజేష్ కుమార్, గౌరవ్ చౌదరితో పాటు ఐఐఎంసిఎఎ కోశాధికారి అనిమేష్ బిస్వాస్, సిసి సభ్యుడు నీరాజ్  పాల్గొన్నారు.

గువహతిలో జరిగిన ఐ‌ఐ‌ఎం‌సి‌ఏ‌ఏ నార్త్-ఈస్ట్ చాప్టర్ మీట్‌లో  అస్సాం ఇన్ఫర్మేషన్ కమిషనర్ & చాప్టర్ ప్రెసిడెంట్ సముద్ర గుప్తా కశ్యప్ మాస్ కమ్యూనికేషన్‌లో  ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అభివృద్ధిపై  స్పందించారు.

నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని పలువురు ఐఐఎంసి పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ సమావేశంలో అదనపు డిసిపి- గౌహతి నుమల్ మహట్టా, ఎస్‌ఎస్‌బి కమాండెంట్ అభిషేక్ ఆనంద్, మాజీ ఐఐఎంసిఎఎ ప్రధాన కార్యదర్శి మిహిర్ రంజన్, రితేష్ వర్మ, దాదాన్ విశ్వకర్మ, మనోజ్ ఖండేల్‌వాల్, నిబుల్ గుప్తా ప్రసంగించారు. దేకా, అనుమితా దాస్, ఆకాన్షా భగవతి, త్రిష్ణ దాస్ తదితరులు పాల్గొన్నారు.
 

click me!