ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి ఇంకా కొద్దిరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది మీరు ఇంకా ఐటిఆర్ ఫైల్ చేయకపోతే వెంటనే ఫైల్ చేయండి లేకపోతే పెద్ద ఎత్తున మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఐదువేల రూపాయల జరిమానా నుంచి జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి అసెస్‌మెంట్ సంవత్సరంలో, ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయ సమాచారాన్ని సేకరించి, ఐటీఆర్ ఫైల్ చేయడానికి నాలుగు నెలల సమయం ఇస్తుంది. సాధారణంగా ఈ నాలుగు నెలల వ్యవధి ఏప్రిల్ 1 నుంచి మొదలై జూలై 31న ముగుస్తుంది. ఇది ఆడిట్ అవసరం లేని ఖాతాల కోసం జీతం పొందే ఉద్యోగులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు వర్తిస్తుంది. మీరు సమయానికి మీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, మీకు జరిమానా విధిస్తారు. ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో జైలు ఊచలు కూడా లెక్కించాల్సి రావచ్చు. అలాగే పన్ను రిటర్న్ కూడా పొందలేము. మీరు జూలై 31లోపు మీ ITRని ఫైల్ చేయకుంటే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మీ లాభాలతో ఈ సంవత్సరం మీ నష్టాలను భర్తీ చేయలేరు.
రూ. 5 వేలు జరిమానా
జూలై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేని వారు ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అనుమతించబడతారు. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆలస్యమైన ఐటీఆర్‌ను సమర్పించడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. అయితే, ఐటీఆర్ ఆలస్యంగా సమర్పిస్తే జరిమానా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 34ఎఫ్ ప్రకారం, మీరు మీ ITRని జూలై 31 తర్వాత, డిసెంబర్ 31లోపు ఫైల్ చేస్తే, గరిష్టంగా రూ. 5,000. జరిమానా విధిస్తారు. డిసెంబర్ 31, 2023 తర్వాత ITR సమర్పించినట్లయితే 10,000. జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
లాభ-నష్టాల సమన్వయం సాధ్యం కాదు
మీరు జూన్ 31వ తేదీలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే, ఈ సంవత్సరం మీరు పొందిన నష్టాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్జించే లేదా సర్దుబాటు చేసే (సెటాఫ్) అవకాశాన్ని మీరు కోల్పోతారు.
టాక్స్ రిటర్న్ పొందలేరు..
మీరు తగిన పత్రాలను అందజేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీ ఆదాయం నుండి ఇప్పటికే తీసివేసిన పన్నును తిరిగి చెల్లిస్తుంది. కానీ మీరు జూన్ 31 లోపు ITR ఫైల్ చేయకపోతే, మీకు టాక్స్ రిటర్న్ లభించదు.
వడ్డీ కూడా చెల్లించాలి
మీరు ఇప్పటివరకు చెల్లించిన పన్ను ఆదాయపు పన్ను శాఖ లెక్కించిన పన్ను కంటే తక్కువగా ఉంటే, మీరు వడ్డీతో సహా బకాయి పన్ను చెల్లించాలి.