Petrol Diesel Prices:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. ఆరు నెలల కనిష్ట స్థాయికి ముడి చమురు..

Published : Aug 17, 2022, 09:32 AM IST
Petrol Diesel Prices:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు..  ఆరు నెలల కనిష్ట స్థాయికి ముడి చమురు..

సారాంశం

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు బుధవారం ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త  ధరలను విడుదల చేశాయి. నేటికీ వాటి ధరలలో ఎటువంటి మార్పు లేదు. దేశంలోనే అత్యంత చౌకగా పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. 

న్యూఢిల్లీ. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం కొనసాగుతోంది. చైనాలో పెట్రోల్-డీజిల్ ప్రాసెసింగ్ రెండున్నర సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది అలాగే  చమురు వినియోగం తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలపైనా ఒత్తిడి నెలకొంది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు బుధవారం ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త  ధరలను విడుదల చేశాయి. నేటికీ వాటి ధరలలో ఎటువంటి మార్పు లేదు. దేశంలోనే అత్యంత చౌకగా పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. ముడి చమురు గురించి మాట్లాడినట్లయితే, గత 24 గంటల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 92.51కి చేరింది, అయితే WTI బ్యారెల్‌కు మూడు డాలర్ల కంటే ఎక్కువ పడిపోయి $ 86.85 కు చేరుకుంది.

మెట్రో  నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72, డీజిల్ ధర  లీటరుకురూ. 89.62 
- ముంబైలో పెట్రోలు ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27 
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
- కోల్‌కతాలో పెట్రోల్ రూ. 106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76
- నోయిడాలో పెట్రోల్ రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96.
- లక్నోలో లీటరు పెట్రోలు రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
- పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ రూ.84.10, డీజిల్ రూ.79.74గా ఉంది.
- హైదరాబాద్‌ లీటరు పెట్రోల్ రూ. 109.66, డీజిల్ రూ. 97.82
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తుంటారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

 పెట్రోల్ డీజిల్ తాజా ధరలను  మీరు SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ సిటీ కోడ్‌ను 9224992249 నంబర్‌కు BPCL కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్  పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. HPCL కస్టమర్లు HPPrice అండ్ వారి సిటీ కోడ్‌ని వ్రాసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Under rs200 Things: అమెజాన్‌లో రూ.200లోపు మీ ఇంటికి పనికొచ్చే వస్తువులు ఇవిగో
Today Gold Price: కుప్పకూలిపోయిన పసిడి, ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు ఢమాల్