పిల్లలకు వేసవి సెలవుల్లో ఈ విషయాలు నేర్పిస్తే..చదువు పూర్తవ్వక ముందే కోటీశ్వరుడు అవడం ఖాయం..

By Krishna AdithyaFirst Published May 16, 2023, 2:08 PM IST
Highlights

పిల్లలకు వేసవికాలం సెలవులు ఇచ్చేశారు ఇంటివద్ద ఆడుకుంటూ సమయం వెళ్లి బుచ్చుతుంటారు. అయితే  సంవత్సరం అంతా చదువుకొని పరీక్షలు రాసిన పిల్లలకు వేసవి సెలవులు అనేది ఒక ఆటవిడుపు.  కానీ రోజంతా ఆడుకోవడం ద్వారా సమయం వృధా అవుతుందని భావించే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు.  అయితే వారు ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఏవైనా కొత్త విషయాలు నేర్పాలని భావిస్తే మాత్రం,  అనేక కొత్త విషయాలు నేర్పించ వచ్చు.

పిల్లలకు తమ జీవితంలో ఎదగాలంటే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొన్ని ప్రాథమిక సూత్రాలను నేర్పించవలసి ఉంటుంది వాటిని ప్రాక్టికల్ గా నేర్పించేందుకు వేసవి సెలవులు చక్కగా ఉపయోగపడతాయి.  ఉదాహరణకు 13 సంవత్సరాలు దాటిన పిల్లలు  అంటే టీనేజీ దశలోకి వారు ప్రవేశిస్తారు.  ఒక రకంగా చెప్పాలంటే వారు సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను తెలుసుకునేందుకు అర్హులు అవుతారు.  ముఖ్యంగా డబ్బు గురించి  అనేక విషయాలను వాళ్లకు చెప్పవచ్చు.   భవిష్యత్తులో వారు ఏ విధంగా పొదుపు చేసుకోవాలి.  ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు నేర్చుకోవాలి వాటివి పిల్లలకు వేసవికాలంలో నేర్పించవచ్చు. 

పిల్లలను బ్యాంకుకు తీసుకువెళ్లండి..

12 సంవత్సరాలు దాటిన పిల్లలు బ్యాంకింగ్ వ్యవహారాలను అర్థం చేసుకుంటే వీలుంటుంది.  అందుకే మీరు తరచుగా బ్యాంకుకు వెళ్లినప్పుడు పిల్లలను తీసుకొని వెళ్ళండి అక్కడ బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేస్తారు.  డబ్బుని ఎలా విత్ డ్రా  చేస్తారు.  చెక్ బుక్ అంటే ఏంటి.  డిడి ఎలా తీస్తారు వంటి ప్రాథమిక విషయాలను పిల్లలకు నేర్పిస్తే మంచిది. అలాగే పిల్లల  పేరిట ఒక సేవింగ్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి వారికి అది ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే మంచిది. 

పిల్లల పేరిట సేవింగ్స్ అకౌంట్ తెరవండి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మైనర్ పిల్లల కోసం రెండు సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్  అకౌంట్లు ఓపెన్ చేసింది. పెహ్లా కదమ్ , పెహ్లీ ఉడాన్ పేరిట రెండు బ్యాంకింగ్  ఖాతాలను తెరిచేందుకు సదుపాయం కల్పించింది. ఇవి పిల్లలకు డబ్బు ఆదా చేయడం ప్రాముఖ్యతను నేర్చుకోవడంలో సహాయపడతాయి. రెండు పొదుపు ఖాతాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన బ్యాంకింగ్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఇవి ఆధునిక బ్యాంకింగ్‌లోని వివిధ మార్గాలతో పిల్లలకు పరిచయం చేయడమే కాకుండా, వ్యక్తిగత ఫైనాన్స్ , సూక్ష్మ నైపుణ్యాలను కూడా నేర్పుతాయి. వారు డబ్బును తెలివిగా ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి లిమిట్ కూడా పెట్టవచ్చు. 

స్టాక్ మార్కెట్ గురించి పిల్లలకు ప్రాథమిక అంశాలు నేర్పించండి..

అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అందులో పెట్టుబడి ఎలా పెడతారు,  భారతదేశంలోని ఏ ఏ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి వంటి విషయాలను పిల్లలకు నేర్పడం ద్వారా భవిష్యత్తులో వారు పెట్టుబడి పెట్టేందుకు సన్నద్ధులు అవుతారు.  ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్ వ్యవస్థ చాలా సులభమైనది పిల్లలు సైతం అర్థం చేసుకోగలరు.  దీనికి సంబంధించిన ప్రాథమిక విషయాలు పిల్లలకు చెబితే వారు పెట్టుబడి పట్ల ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంది. 

పిల్లలకు మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన కల్పించండి…

 చిన్న వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్ లో పొదుపు చేయడం నేర్పించడం ద్వారా వారు చదువు పూర్తయ్యాక నాటికి మంచి మొత్తం లో డబ్బు పొందగలిగే అవకాశం ఉంది ఉదాహరణకు 500 రూపాయల SIP ప్రాతిపదికన ప్రతినెల మ్యూచువల్ ఫండ్స్ లో ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినట్లయితే,  వారు 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి వారి చేతిలో సుమారు 40 వేల రూపాయలు ఉంటాయి. అంటే వారి పెట్టుబడి పై సుమారు పదివేల వరకు లాభం పొందే అవకాశం ఉంది.  ఇలాంటి  ప్రాథమిక అంశాలు పిల్లల్లో డబ్బు సంపాదన పట్ల ఆసక్తిని పెంచేందుకు దోహదపడతాయి. 

click me!