ఎల్‌పి‌జి సిలిండర్ ధరలో భారీ తగ్గింపు.. వరుసగా 5వసారి.. నేటి నుంచి అమల్లోకి..

By asianet news teluguFirst Published Sep 1, 2022, 10:27 AM IST
Highlights

ఈ రోజు నుండి ఢిల్లీలో 19 కిలోల LPG సిలిండర్ ధర రూ.1976.50 నుండి  రూ.1885 చేరింది. కోల్‌కతాలో ధరలు రూ.1995.5కి తగ్గాయి, ఇంతకుముందు ధర రూ.2095. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సిలిండర్ ధర రూ.1844కి తగ్గింది. 

భారాతదేశంలో ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు సెప్టెంబర్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలపై పెద్ద ఊరట లభించింది. నేడు అంటే సెప్టెంబర్ 1న ఎల్‌పిజి సిలిండర్ల ధరలు తగ్గాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర భారీగా రూ.100 తగ్గింది. అయితే, ఈ ధర తగ్గింపు కేవలం వాణిజ్య సిలిండర్లపై మాత్రమే. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు, పాత ధరకే అందుబాటులో ఉంది. ఢిల్లీ గురించి మాట్లాడితే సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చేల ఇండేన్ 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.91.50 తగ్గింది. మరోవైపు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ కోల్‌కతాలో రూ.100, ముంబైలో రూ.92.50, చెన్నైలో రూ.96 తగ్గింది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపు దేశంలోని దాదాపు ప్రతి ప్రముఖ నగరంలో అందుబాటులో ఉంటుంది.

సిలిండర్ ధర ఎంత తగ్గుతుందో తెలుసా?
ఈ రోజు నుండి ఢిల్లీలో 19 కిలోల LPG సిలిండర్ ధర రూ.1976.50 నుండి  రూ.1885 చేరింది. కోల్‌కతాలో ధరలు రూ.1995.5కి తగ్గాయి, ఇంతకుముందు ధర రూ.2095. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సిలిండర్ ధర రూ.1844కి తగ్గింది. వాణిజ్య సిలిండర్ల ధర తగ్గడం వరుసగా ఇది ఐదోసారి. 

జూలై 6 నుంచి 
వంటింటి గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడితే  జూలై 6 నుండి దీని ధరలో ఎటువంటి మార్పు లేదు. అంటే, సిలిండర్ ఇప్పటికీ అదే ధరకు అందుబాటులో ఉంటుంది. ఇండేన్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1053 కాగా, కోల్‌కతాలో రూ.1079, ముంబైలో 1052, చెన్నైలో రూ.1068.  

ఆగస్టు 1న కూడా 
గ్యాస్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరలను నిర్ణయిస్తాయి. ఈ కారణంగా గత నెల ప్రారంభంలో అంటే ఆగస్టు 1వ తేదీన కూడా గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించారు. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర గతంలో రూ.2012.50 ఉండగా, ఈ తగ్గింపు తర్వాత ధర రూ.1976.50కి తగ్గింది.

ఐదోసారి తగ్గిన ధరలు
2022 మే 19న రికార్డు ధర రూ.2354కి చేరిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ జూన్ 1న రూ.2219గా చేరింది.

తరువాత నెల రోజుల తర్వాత సిలిండర్ ధర రూ.98 తగ్గి రూ.2021 అయింది.

జూలై 6న చమురు కంపెనీలు సిలిండర్ ధరను రూ.2012.50కి తగ్గించాయి.

ఆగస్టు 1 నుంచి సిలిండర్‌ రూ.1976.50 తగ్గింది.

ఇప్పుడు సెప్టెంబర్ 1న రూ.1885 చేరింది.

click me!