LIC IPO without Demat Account: డీ మ్యాట్ అకౌంట్ లేకుండా ఎల్ఐసీ ఐపీవో అప్లై చేయవచ్చా...అయితే ఇలా ఫాలో అయిపోండి

Published : May 03, 2022, 07:12 PM IST
LIC IPO without Demat Account: డీ మ్యాట్ అకౌంట్ లేకుండా ఎల్ఐసీ ఐపీవో అప్లై చేయవచ్చా...అయితే ఇలా ఫాలో అయిపోండి

సారాంశం

Invest in LIC IPO without Demat Account: ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనాలని ఉందా, అయితే డీమ్యాట్ అకౌంట్ లేకుండానే కేవలం పేటీఎం యాప్ ద్వారా ఈ ఐపీవోలో పాల్గొనేందుకు ఒక ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. మీరు కూడా కేవలం ఒక క్లిక్ ద్వారా ఐపీవో లో ఎలా పాల్గొనాలో తెలుసుకోండి. 

How to Invest in LIC IPO without Demat Account: ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసి IPO రేపటి నుంచి ( మే 4) రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే  యాంకర్ ఇన్వెస్టర్ల కోసం LIC IPO సోమవారమే ప్రారంభం కాగా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మే 4 నుంచి రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవబోతోంది. రిటైల్ ఇన్వెస్టర్లు మే 9 వరకు ఎల్‌ఐసి ఐపిఓ కోసం అప్లై చేసుకోవచ్చు. 

ఇదిలాఉంటే గ్రే మార్కెట్‌లో ప్రీమియం (LIC IPO GMP) పెరుగుదల కారణంగా, LIC లిస్టింగ్ రోజున అలాట్ అయిన ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించే వీలుందని అంచనాలు ఉన్నాయి. కాగా IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకునే డీ మ్యాట్ ఖాతా అవసరం లేకుండా అప్లై చేయవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం. 

QR కోడ్‌ని స్కాన్ చేసిన వెంటనే Demat Account:
Fintech కంపెనీ Paytm యాప్ LIC IPOని సులభంగా యాక్సెస్ చేసేందుకు కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వచ్చింది. దీని కింద, Paytm  మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ స్థానిక ప్రాంతంలోని కిరాణా దుకాణాలు, ఇతర దుకాణాలలో ప్రత్యేక QR కోడ్‌ ప్రవేశపెట్టింది. ఈ QR కోడ్‌లను Paytm Money app  ద్వారా యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. వీటిని స్కాన్ చేసిన వెంటనే ఎలాంటి ఛార్జీలు లేకుండా చిటికెలో Demat Account మీ పేరిట ఓపెన్ అవడం వీటి ప్రత్యేకత. తద్వారా మీరు LIC IPOలో సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. 

IPO తెరవడానికి ముందే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు
వాస్తవానికి, స్టాక్ మార్కెట్‌లో ఏ రకమైన వ్యాపారం చేయాలన్నా Demat Account అవసరం. అందుకే ఎల్‌ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి Demat Account అవసరం. Paytm ఈ కారణంగా ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది. తద్వారా ఇంకా Demat Account తెరవలేకపోయిన వారు కూడా LIC IPOలో పాల్గొనవచ్చు. Paytm Pre Open IPO అప్లికేషన్‌ను కూడా ప్రారంభించింది. ఇది IPO ప్రారంభానికి ముందే దరఖాస్తు చేసుకోవడానికి పెట్టుబడిదారులకు సహాయపడుతుంది. ఈ ముందస్తు అప్లికేషన్‌లు Paytm Money సిస్టమ్‌లో రికార్డ్ అవుతాయి. IPO ప్రారంభం అయిన వెంటనే, Paytm Money మీ బిడ్  రికార్డులను స్టాక్ మార్కెట్‌కు పంపుతుంది.

LIC IPO విశేషం ఇదే...
ఈ ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీలో ప్రభుత్వం తన 5 శాతం వాటాను విక్రయించనుంది. అయితే, ఇప్పుడు దాని పరిమాణం తగ్గించబడింది. సవరించిన ముసాయిదా ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం ఎల్‌ఐసీలో కేవలం 3.5 శాతం వాటాను మాత్రమే విక్రయించబోతోంది. ఈ విధంగా, LIC యొక్క IPO ఇప్పుడు 21 వేల కోట్ల రూపాయల విలువైనది. అయితే, దీని తర్వాత కూడా, ఇది ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద IPO అవుతుంది. గత ఏడాది రూ.18,300 కోట్ల ఐపీఓను ప్రవేశపెట్టిన పేటీఎం పేరిట ఇప్పటి వరకు ఈ రికార్డు ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!