RBI Repo Rate: ఆర్‌బీఐ రెపో రేటు ఎఫెక్ట్‌.. రూ.లక్షకు ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 08, 2022, 04:23 PM IST
RBI Repo Rate: ఆర్‌బీఐ రెపో రేటు ఎఫెక్ట్‌.. రూ.లక్షకు ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే..?

సారాంశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.  ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకే రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడు రోజుల  ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.  

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. రెపో రేటును మళ్లీ పెంచింది. నెల రోజుల వ్యవధిలో రేపో రేట్ పెంచడం ఇది రెండోసారి. కిందటి సారి కంటే ఈ పెంపు మరింత అధికం. ఇదివరకు 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. తాజాగా ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

రేపో రేటు 4.9 శాతానికి

ఫలితంగా రెపో రేటు 4.9 శాతానికి పెరిగింది. దీని ప్రభావం వడ్డీ రేట్ల మీద విపరీతంగా పడింది. బ్యాంకులన్నీ తమ వడ్డీ రేట్లను మరోసారి సవరించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో మూడురోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను శక్తికాంత దాస్ వెల్లడించారు. కొన్ని ఊరటలను కల్పించారు.

లోన్లు భారం

కాగా- 50 బేసిస్ పాయింట్లను పెంచడం వల్ల రేపో రేట్ 4.9 శాతానికి పెరిగింది. దీని ప్రభావం లోన్లపై పడుతుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న లోన్లపై ప్రతి నెలా రుణ గ్రహీతలు చెల్లించే ఈక్వెటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ మొత్తం మరింత పెరుగుతుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఈ మేరకు తమ బేసిస్ పాయింట్లను సవరించడం ఖాయం.

గృహావసరాల కోసం 

గృహావసరాల కోసం 30 లక్షల రూపాయల లోన్ తీసుకున్న వారి అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ గడువు 20 సంవత్సరాలకు ఏడుశాతం మేర పెరుగుతుంది. 30 లక్షల రూపాయల రుణానికి ఇప్పుడు 23,259 రూపాయల ఈఎంఐ చెల్లిస్తుంటే అది పెరుగుతుంది. 24,907 రూపాయలకు చేరుతుంది. అంటే 1,648 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

వాహనావసరాల కోసం 

ఆటో, వాహన అవసరాల కోసం ఎనిమిది లక్షల రూపాయల రుణాలను తీసుకున్న వారి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ గడువు ఏడు సంవత్సరాలు ఉంటే- ఈఎంఐ 10 శాతం నుంచి 10.9 శాతానికి పెరుగుతుంది. ప్రతినెలా 13,281 రూపాయల ఈఎంఐ మొత్తాన్ని చెల్లించే రుణ గ్రహీతలు ఇకపై 13,656 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 375 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

పర్సనల్ లోన్
 
వ్యక్తిగత (పర్సనల్) అవసరాల కోసం అయిదు లక్షల రూపాయల రుణాలను తీసుకున్న వారి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ గడువు అయిదు సంవత్సరాల వరకు ఉంటే నెలవారీ వడ్డీ రేటు 14 నుంచి 14.9 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుతం కడుతున్న 11,634 రూపాయల ఈఎంఐ 11,869 రూపాయలకు పెరుగుతుంది. అంటే 235 రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తుంది.

PREV
click me!

Recommended Stories

Indian Economy: వామ్మో..డబ్బు తయారీకే ఇంత ఖర్చా, RBI షాకింగ్ లెక్కలు.
8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?