మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండొచ్చో తెలుసా ? లిమిట్ దాటితే ఎం జరుగుతుంది..

By Ashok kumar Sandra  |  First Published Mar 22, 2024, 2:36 AM IST

ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా ? ఎక్కువ  సేవింగ్స్ పెట్టే ముందు సేవింగ్స్  ఖాతాలో  నగదు పరిమితి గురించి తెలుసుకోండి... 
 


సేవింగ్స్ అకౌంట్ అనేది అవసరానికి డబ్బు   ఉపయోగపడేందుకు  చాల మంది ఎంచుకునే అప్షన్. గణాంకాల ప్రకారం, భారతదేశంలోని చాలా మంది బ్యాంకింగ్ కస్టమర్లు  డబ్బును వృధా ఖర్చు కాకుండా పొదుపు ఖాతాలలో జమ చేస్తుంటారు. అయితే మీరు మీ పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చో మీకు తెలుసా లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి ? సేవింగ్స్ పెట్టే ముందు, సేవింగ్స్  అకౌంట్లో అధిక నగదు పరిమితి గురించి తెలుసుకోండి. ఎందుకంటే పరిమితి ఎక్కువగా ఉంటే, మీకు ఆదాయపు పన్ను నోటీసు వచ్చే అవకాశం ఉంది

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో డిపాజిట్ చేయడానికి పరిమితి రూ.10 లక్షలు. ఆదాయపు పన్ను చట్టం, 1962లోని సెక్షన్ 114B ప్రకారం అన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆదాయపు పన్ను శాఖకు డిపాజిట్లను నివేదించాలి. ప్రతి సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన డబ్బు నిర్ణీత పరిమితిని మించి ఉందా లేదా అనేది శాఖ చెక్  చేస్తుంది.

Latest Videos

undefined

ట్రాన్సక్షన్ ఎలా లెక్కించబడుతుంది?

ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ పెట్టిన డబ్బు వ్యక్తి  అన్ని ఖాతాలను పరిగణనలోకి తీసుకొని లెక్కించబడుతుంది. నిబంధనల ప్రకారం, మీరు మీ సేవింగ్స్ ఖాతాలో పరిమితికి మించి డబ్బు ఉంచినట్లయితే, అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. అంతేకాదు  నిర్దేశిత పరిమితికి మించి ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

click me!