అనంత్ అంబానీ పెట్టుకున్న వాచీ ఒకటి, రెండు కోట్లు కాదు... ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వాచ్ ఖరీదు గురించి సైబర్ ప్రపంచంలో వార్తలు చెక్కర్లుకొడుతున్నాయి.
అంబానీ కుటుంబం లగ్జరీ లైఫ్ స్టయిల్ చాల మందిని ఆశ్చర్యపరుస్తుంది, ఆకట్టుకుంటుంది కూడా. ముఖేష్ అంబానీ అతని భార్య నీతా అంబానీ వారి ఫ్యామిలీ మొత్తం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన అంటిలియాలో నివసిస్తున్నారు. వినాయక చతుర్థి వేడుకలు అంటిలియాలో పూజ, విందుతో జరిగాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అంబానీ ఆహ్వానాన్ని మన్నించి హాజరయ్యారు. రణవీర్ సింగ్-దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్ సహా పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు.
గణేశ చతుర్థి వేడుకలకు వచ్చిన అతిథులను ముఖేష్, నీతా అండ్ అనంత్ అంబానీ స్వాగతిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆరెంజ్ కుర్తా, ఎంబ్రాయిడరీ చేసిన నెహ్రూ జాకెట్‌లో అనంత్ అంబానీ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది అనంత్ ధరించిన లగ్జరీ వాచ్.
undefined
అనంత్ అంబానీ డైమండ్ పొదిగిన బ్రాస్‌లెట్‌తో 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ వాచ్‌ను ధరించారు. ఈ వాచ్ ఒక సున్నితమైన ఫిక్స్డ్ బెజెల్ పై 436 బాగెట్-కట్ డైమండ్స్‌తో అలంకరించబడింది. దీని ధర 13 కోట్లు అని సమాచారం.
ఇదిలా ఉంటే అనంత్ అంబానీ కలెక్షన్‌లో ఖరీదైన వాచ్ మాత్రమే కాదు, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్ రోజున అనంత్ అంబానీ ధరించిన రిస్ట్ వాచ్ ధర 18 కోట్లు. లగ్జరీ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ VVIP కస్టమర్ల కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన వాచ్.