HDFC-HDFC Bank Merger: భారతదేశపు అతిపెద్ద హోమ్ ఫైనాన్స్ కంపెనీ HDFC లిమిటెడ్. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో విలీనం కాబోతోంది. ఈ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.
HDFC-HDFC Bank విలీనానికి తేదీ నిర్ణయించారు. హెచ్‌డిఎఫ్‌సి-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బోర్డు సమావేశం జూన్ 30న మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత జరగనుంది. రెండు సంస్థల విలీనానికి రెగ్యులేటరీ ఆమోదం లభించింది. విలీనం తర్వాత HDFC కంపెనీ ఉండదు. HDFC తన సంస్థే అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో విలీనం చేయబడుతుంది. HDFC ఫైనాన్స్ సంస్థ కస్టమర్‌లు కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్‌లు అవుతారు.
జూలై 13న HDFC షేర్ల డీ లిస్టింగ్
హెచ్‌డిఎఫ్‌సి షేర్ల డీలిస్టింగ్ జూలై 13 నుంచి అమల్లోకి వస్తుందని హెచ్‌డిఎఫ్‌సి వైస్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెకి మిస్త్రీ తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సిని తనలో విలీనం చేసేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గత ఏడాది ఏప్రిల్ 4న అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ.3.28 లక్షల కోట్లు. ఇది దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విలీన ఒప్పందంగా పేర్కొంది. ఈ విలీనం తర్వాత, భారతదేశంలో ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీ అవతరించనుంది.
హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా అవతరించనున్నాయి. ఈ డీల్ విలువ రూ.4.53 లక్షల కోట్లు. విలువ ఉంది ఈ ఏడాదిలో ఇది రెండో అతిపెద్ద డీల్. ఈ డీల్, విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.15.12 లక్షల కోట్లుగా ఉంటుంది. చేరుతుంది. విలీనం తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 100% పబ్లిక్ షేర్‌హోల్డర్‌ల యాజమాన్యంలో బ్యాంక్ అవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి యొక్క ప్రస్తుత వాటాదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 41% షేర్లను కలిగి ఉంటారు. ఇక నుండి, HDFC అనుబంధ సంస్థలు, HDFC బ్యాంక్‌లో విలీనం చేయబడతాయి. మార్పిడి విలీనం ద్వారా 41% వాటా కొనుగోలు చేయబడుతుంది. హెచ్‌డిఎఫ్‌సి వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి 25 షేర్లకు 42 బ్యాంక్ షేర్లను పొందుతారు. ఈ విలీనానికి 12.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్, 17.9 లక్షల కోట్లు బ్యాలెన్స్ షీట్ రూపొందించబడుతుంది.
షేర్లకు ఏమి జరుగుతుంది
ఈ విలీనం తర్వాత ఏర్పడే కొత్త సంస్థ ఉమ్మడి ఆస్తి దాదాపు రూ.18 లక్షల కోట్లు. ఈ డీల్ ప్రకారం, హెచ్‌డిఎఫ్‌సిలోని ప్రతి వాటాదారుడు ప్రతి 25 షేర్లకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 42 షేర్లను పొందుతారు.
గతేడాది నుంచి సన్నాహాలు ఫ్రారంభం..
HDFC-HDFC బ్యాంక్ విలీనం ఏప్రిల్ 2022లో ప్రకటించారు. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌పై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. HDFC లిమిటెడ్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి తొలగించబడతాయి. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ షేర్లు జులై 13 నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లుగా ట్రేడింగ్ ప్రారంభమవుతాయి. ఈరోజు బిఎస్‌ఇలో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రెండింటి షేర్లు ఒక్కొక్కటి 1.5 శాతం లాభపడ్డాయి.