మద్యం వ్యాపారంలోకి బాలివుడ్ స్టార్ సంజయ్ దత్, స్కాచ్ విస్కీ ఫుల్ బాటిల్ కేవలం రూ.1550 మాత్రమే అట..

By Krishna Adithya  |  First Published Jun 27, 2023, 6:27 PM IST

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాజాగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయన రష్యాకు చెందిన ఓ ప్రసిద్ధ స్కాచ్ విస్కీ బ్రాండ్ ను మన దేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బ్రాండ్ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర స్కాచ్ విస్కీలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు.


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవలే గ్లెన్ వాక్ అనే లిక్కర్ బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఆయన ప్రముఖ మద్యం తయారీ సంస్థ కార్టెల్ అండ్ బ్రదర్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ వ్యాపారంలో ప్రవేశించారు. ఈ కంపెనీ 'ది గ్లెన్‌వాక్' పేరుతో స్కాచ్ విస్కీని ఉత్పత్తి చేస్తుంది. సంజయ్ దత్ భారతదేశంలో 'ది గ్లెన్‌వాక్' బ్రాండ్‌ను దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఈ విస్కీని రష్యాలో ఉత్పత్తి చేస్తారు. గ్లెన్ వాక్ విడుదల సందర్భంగా, సంజయ్ దత్ మాట్లాడుతూ, సినిమాతో పాటు ఇతర రంగాల్లోకి విస్తరిస్తోంది. సంజయ్ దత్ మద్యం బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టడం ఇది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో, అతను డ్వాన్ టౌన్ అనే స్నీకర్ బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టారు. ఇక భవిష్యత్తులో తాను మరో దుస్తుల బ్రాండ్ లేదా సాఫ్ట్‌వేర్, విద్య సంబంధిత కంపెనీలో సైతం భాగస్వామి అవ్వాలని చూస్తున్నట్లు సంజయ్ దత్ తెలిపారు. 

నేను ఇప్పుడు వ్యాపారవేత్తను కాదు. నా భార్య, పార్ట్ నర్స్ ఈ డబ్బు వ్యవహారాలను చూసుకుంటారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టే ముందు ఆ సంస్థ పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరుతోందా లేదా అనేది పరిశీలిస్తానని చెప్పారు. కానీ గ్లెన్ వాక్ బ్రాండ్ విషయంలో, తనను ధర చాలా ఆకర్షించింది. మార్కెట్‌లో ఈ విస్కీ కేవలం రూ. 1,550కి దిగుమతి చేసుకుంటున్నామని. ఇంత తక్కువ ధరలో మరో స్కాచ్ బ్రాండ్ అందుబాటులో లేదని తెలిపారు. అందువల్లనే తాను ఈ సరసమైన ధర ఉన్న స్కాచ్ విస్కీని మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినట్లు సంజయ్ దత్ తెలిపారు.  

Latest Videos

దత్‌తో పాటు మరో నలుగురు ఈ బిజినెస్ లో పార్ట్ నర్లుగా ఉన్నారు. భారతదేశంలోని లిక్కర్ రిటైల్ చైన్ లివింగ్ లిక్విడ్స్‌కు చెందిన మహేష్ సాని, మోక్ష్ సాని, డ్రింక్వా బార్ అకాడమీకి చెందిన జితిన్ మెరానీ . మోర్గాన్ బెవరేజెస్ యజమాని రోహన్ నిహ్లానీ కూడా ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. ముంబై నుంచి ప్రారంభించి, గ్లెన్ వాక్ బ్రాండ్‌ను పూణేతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు రోహన్ నిహ్లానీ తెలిపారు.

ఉత్తరాదిలో, గ్లెన్ వాక్ ముందుగా ఢిల్లీ, హర్యానాలో మార్కెట్లోకి ప్రవేశపెడతారు. దక్షిణాదిలో, ఇది మొదట కర్ణాటక లేదా తెలంగాణలో ప్రవేశపెట్టనున్నారు. తరువాత నెమ్మదిగా ఇతర మార్కెట్లకు వ్యాపిస్తామని తెలిపారు. వచ్చే ఐదు నెలల్లో వీలైనన్ని ఎక్కువ సరుకుతో మార్కెట్లలోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే కర్ణాటక, గోవా, హైదరాబాద్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు మరికొంత సమయం పడుతుంది' అని రోహన్ నిహ్లానీ అన్నారు.

click me!