శుభవార్త: మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు

By narsimha lodeFirst Published Aug 10, 2018, 3:13 PM IST
Highlights

మరిన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ భావిస్తోంది. త్వరలోనే మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ ధరలను తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రెవిన్యూ పెరిగితే మరిన్ని ఉత్పత్తులపై కూడ జీఎస్టీ పన్నును తగ్గించనున్నట్టు ఆయన ప్రకటించారు.
 


న్యూఢిల్లీ: మరిన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ భావిస్తోంది. త్వరలోనే మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ ధరలను తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రెవిన్యూ పెరిగితే మరిన్ని ఉత్పత్తులపై కూడ జీఎస్టీ పన్నును తగ్గించనున్నట్టు ఆయన ప్రకటించారు.

జీఎస్టీ చట్టాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  పీయూష్ గోయల్  లోక్‌సభలో  ప్రకటన చేశారు.  పీయూష్ గోయల్ ప్రసంగానికి విపక్షాలు పలు దఫాలు అడ్డు తగిలినా కూడ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

గత సమావేశాల్లో చాలా ఉత్పత్తులు, సర్వీసులపై జీఎస్టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పరోక్ష పన్ను విధానం ద్వారా వినియోగదారులపై పన్ను భారాన్ని మరింత తగ్గించనున్నట్టు ఆయన చెప్పారు.   గత ఏడాదిగా జీఎస్టీ కౌన్సిల్‌ 384 ఉత్పత్తులు, 68 సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించింది. 186 ఉత్పత్తులు, 99 సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిందన్నారు. 

దేశీయ ఆర్థిక లోటుకు అనుగుణంగా జీఎస్టీని సేకరిస్తున్నామని చెప్పారు. అంచనావేసిన దానికంటే భారత వృద్ధి మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ విడుదల చేసిన రిపోర్టులో కూడా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని అంచనావేసిన విషయాన్ని పీయూష్ సభలో చెప్పారు. 

తన ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు  అడ్డుచెప్పడంపై  పీయూష్ గోయల్ మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ నేతలు  నిర్లక్ష్యంగా వదిలేసిన అంశాలను  తమ ప్రభుత్వం  చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 


 

click me!