ఆగస్టు జీఎస్టీ వసూళ్లు అదుర్స్, వరుసగా 6 నెల కూడా రూ. 1.40 లక్షల కోట్లు దాటిన వసూళ్లు..

By Krishna AdithyaFirst Published Sep 1, 2022, 4:43 PM IST
Highlights

ఆగస్టు నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 28 శాతం పెరిగాయి. అయితే జూలై 2022తో పోలిస్తే, ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో 4 శాతం క్షీణత నమోదైంది.

జీఎస్టీ వసూళ్లు కేంద్ర ప్రభుత్వానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి.అంతేకాదు, ఆగస్టు నెలలో సైతం జీఎస్టీ వసూళ్లు కొత్త జోష్ నింపాయి. ఆగస్టు 2022 నెలలో స్థూల GST కలెక్షన్ సంవత్సరానికి 28 శాతం పెరిగింది. డేటా ప్రకారం ఆగస్టులో GST వసూళ్లు రూ. 1,43,612 కోట్లుగా నమోదు అయ్యాయి. 

ఆగస్టు 2022 నెల రాబడిని గత సంవత్సరం ఆగస్టు నెలతో పోల్చి చూస్తే రూ. 1,12,020 కోట్ల GST ఆదాయం కంటే 28శాతం ఎక్కువగా ఉందని నిపుణులు తేల్చారు. ఇదిలా ఉంటే వరుసగా ఆరు నెలల పాటు నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.40 లక్షల కోట్లకు పైగా ఉంది. ఆగస్టు 2022 వరకు GST రాబడి మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం పెరిగింది, ఈ లెక్కన చూస్తే జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదలను గమనించవచ్చు.

ఈ ఏడాది ఆగస్టులో మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ (CGST) సహకారం రూ.24,710 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ (SGST) రూ.30,951 కోట్లుగా ఉంది. ఈ నెల మొత్తం జీఎస్టీ వసూళ్లలో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) వసూళ్లు రూ.77,782 కోట్లు కాగా, అందులో రూ.42,067 కోట్లు దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన పన్ను నుంచి వచ్చాయి. సెస్ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టులో రూ.10,168 కోట్ల సెస్ వసూళ్లు జరగ్గా, అందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై సెస్ నుంచి రూ.1,018 కోట్లు రికవరీ అయ్యాయి.

జూలై 2022 నెలలో, 7.6 కోట్ల ఇ-వే బిల్లులు ఉత్పత్తి అయ్యాయి, జూన్ 2022లో 7.4 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే జూన్ 2021లో పోల్చితే 6.4 కోట్లతో పోల్చితే 19 శాతం ఎక్కువగా ఉన్నాయి. 

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు: ఏప్రిల్ 2022లో ఇప్పటివరకు అత్యధిక GST వసూళ్లు జరిగాయి.ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1 లక్షల 67 వేల కోట్లు దాటాయి. జూలై 2022 లో, వసూళ్లు రూ. 1 లక్ష 48 వేల కోట్లు. ఇది రెండో అతిపెద్ద కలెక్షన్.

 KPMG, అభిషేక్ జైన్ మాట్లాడుతూ, "నిరంతరంగా అధిక వసూళ్లు మంచి సంకేతమన్నారు. కోవిడ్ కేసుల కారణంగా కొంచం అస్థిరత కొంత మేరకు ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ ప్రభుత్వం మెరుగైన చర్యలు చేపట్టడంతో జీఎస్టీ వసూళ్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. 

click me!