GST collection April 2022: ఏప్రిల్​లో రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : May 01, 2022, 03:16 PM IST
GST collection April 2022:  ఏప్రిల్​లో రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు..!

సారాంశం

వస్తు, సేవల పన్ను (GST) కింద నెలవారీ వసూళ్లు 2022 ఏప్రిల్‌లో రూ. 1.68 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆదివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్థూల GST వసూళ్లు ఏప్రిల్ 2022లో మొదటిసారిగా రూ. 1.5 లక్షల కోట్ల మార్కును, వరుసగా పదవ నెలలో రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించాయి.  

జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడనంతగా వసూళ్లు వచ్చాయి. 2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42లక్షల కోట్లు.. రెండో అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్​లో.. రూ.25 వేలు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని వివరించింది. 2021 ఏప్రిల్​లో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని స్పష్టం చేసింది.

ఏప్రిల్​లో వసూలైన రూ.1,67,540 కోట్లలో.. సీజీఎస్టీ రూపంలో రూ.33,159 కోట్లు, ఎస్​జీఎస్టీ రూపంలో రూ.41,793 కోట్లు వసూలయ్యాయి. సమీకృత జీఎస్టీ కింద రూ.81,939 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 36,705 కోట్లతో సహా) వచ్చాయి. సెస్ రూపంలో రూ.10,649 కోట్లు  (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 857 కోట్లు కలిపి) వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. ట్యాక్స్ చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు సమర్పించేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలించాయని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పేర్కొంది. జీఎస్టీ చెల్లింపులు సులభంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 1.42 లక్షల కోట్లుగా నమోదు కాగా.. ఇందులో కేంద్ర జీఎస్టీ కింద రూ.25.830 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద రూ.32,378 కోట్లు, సమీకృత జీఎస్టీ కింద రూ.74,470 కోట్లు( అందులో దిగుమతులపై పన్ను వసూళ్ల ద్వారా రూ.39,131 కోట్లు వచ్చాయి.), సెస్​ కింద రూ.9,417 కోట్లు(అందులో దిగుమతుల ద్వారా రూ.981 కోట్లు) వచ్చాయి. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులను దాఖలు చేసేలా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో పలు చర్యలు తీసుకోవడం, కంప్లియెన్స్‌లు సరళీకరించడం, పన్ను ఎగొట్టే వారిపై కఠిన చర్యలు, మెరుగుపడిన ఆర్థిక కార్యకలాపాల వల్ల ఈ పన్ను వసూళ్లు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు