కారణమిదే: ఆపిల్‌కు 9 బిలియన్ల డాలర్ల ‘గూగుల్’ పరిహారం

By narsimha lodeFirst Published Sep 30, 2018, 11:13 AM IST
Highlights

టెక్నాలజీ మేజర్ యాపిల్‌కు ఇంటర్నెట్ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ భారీ మొత్తాన్ని చెల్లించనున్నది. ఐ-ఫోన్‌లోని సఫారీ వెబ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉంచేందుకు యాపిల్‌కు గూగుల్‌ తొమ్మిది బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.65వేల కోట్లు) చెల్లించనున్నదని సమాచారం. 


న్యూఢిల్లీ: టెక్నాలజీ మేజర్ యాపిల్‌కు ఇంటర్నెట్ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ భారీ మొత్తాన్ని చెల్లించనున్నది. ఐ-ఫోన్‌లోని సఫారీ వెబ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉంచేందుకు యాపిల్‌కు గూగుల్‌ తొమ్మిది బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.65వేల కోట్లు) చెల్లించనున్నదని సమాచారం. 

2013, 2014 సంవత్సరాల్లో ఇందుకు గూగుల్‌ బిలియన్‌ డాలర్లు చెల్లించగా 2017లో మూడు బిలియన్‌ డాలర్లు చెల్లించింది. ఈ ఏడాది రెట్టింపు కన్నా ఎక్కువ మొత్తం 9 బిలియన్‌ డాలర్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని గోల్డ్ మాన్ సాచెస్ విశ్లేషకుడు రొడ్ హాల్ తెలిపారు.  

డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ కోసం 2019లో గూగుల్‌ యాపిల్‌కు 12 బిలియన్‌ డాలర్లు (రూ.87వేల కోట్లు) చెల్లించే అవకాశముందని తెలిపింది. యాపిల్‌ నుంచి ఎక్కువ మంది వినియోగదారులు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారని నివేదికలో వెల్లడించింది. గూగుల్‌కు వినియోగదారుల ట్రాఫిక్‌ వచ్చే ముఖ్యమైన ఆధారాల్లో యాపిల్‌ ప్రధానమైనదని గూగుల్‌ విశ్వసిస్తుందని పేర్కొంది. 

యాపిల్‌ ఐఫోన్లు, ఐపాడ్స్‌ సహా ఐఓఎస్‌ పరికరాల్లో సఫారీలో గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉపయోగిస్తోంది.గూగుల్‌ను సఫారీలోని ఐఓఎస్ వద్ద డిఫాల్ట్ సెర్చింజన్‌గా గుర్తించే ఆపిల్ సంస్థ.. సిరి వెబ్ ద్వారా బింగ్‌ను ఇతర ఆన్ లైన్ వేదికల్లో సెర్చింజన్‌గా వినియోగించనున్నది. 2015 నుంచి ఆపిల్ మ్యూజిక్ స్థిరంగా ఎదుగుతున్నది. 

click me!