హజ్ యాత్రికులకు శుభవార్త...క్యాష్ లెస్ హజ్ యాత్ర సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం..ప్రత్యేక ఫారెక్స్ కార్డు జారీ

Published : Apr 04, 2023, 02:16 PM IST
హజ్ యాత్రికులకు శుభవార్త...క్యాష్ లెస్ హజ్ యాత్ర సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం..ప్రత్యేక ఫారెక్స్ కార్డు జారీ

సారాంశం

హజ్ యాత్రికులకు శుభవార్త..ఇప్పుడు నగదును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని చెల్లింపులను SBI కార్డు చేసేలా, కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. 

హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త. ఈ ఏడాది నుంచి 'నగదు రహిత హజ్'కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయత్నంలో హజ్ యాత్రికులు విదేశీ కరెన్సీని ఉపయోగించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ద్వారా కార్డును అందజేయనుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ వర్గాలు సోమవారం ఈ సమాచారాన్ని ఇచ్చాయి. 

గతంలో హజ్ యాత్రికులు 2100 సౌదీ రియాల్స్ (సుమారు రూ. 45 వేలు) భారత హజ్ కమిటీకి డిపాజిట్ చేయాల్సి ఉండేంది, ఇది సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాలో ఖర్చు చేయడానికి వారికి అందుబాటులో ఉంచేవారు. 

ఇకపై హజ్ కమిటీ వద్ద డబ్బు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు
గతానికి భిన్నంగా ఈ సారి హజ్ యాత్రికులు ఈ మొత్తాన్ని హజ్ కమిటీ వద్ద డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వారు ఈ డబ్బును నేరుగా SBI ద్వారా ఉపయోగించుకోవచ్చు. హజ్ యాత్రికులకు  'ఫారెక్స్ కార్డ్' ఇవ్వనున్నారు. అటువంటి పరిస్థితిలో, వారు నగదును తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వారు తమ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేయవచ్చు. డిజిటల్ ఇండియాలో భాగంగా 'నగదు రహిత హజ్'కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  

ఈ ఏడాది హజ్ కోసం 1.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి
మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సంవత్సరం హజ్ కోసం 1.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి, వారిలో 70 ఏళ్లు పైబడిన 10,621 మంది మరియు 'మెహ్రం' (సమీప పురుష బంధువు) లేకుండా హజ్ కోసం దరఖాస్తు చేసిన 4,314 మంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. 

1.4 లక్షల మంది హజ్‌కు ఎంపికయ్యారు
1.4 లక్షల మందిని హజ్ తీర్థయాత్రకు ఎంపిక చేశామని, వారికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించామని, వెయిటింగ్ లిస్ట్‌లో పేర్లు ఉన్న వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ ఏడాది 1,75,025 మంది భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారు. భారత్ నుంచి హజ్ యాత్ర కోసం మొదటి విమానం మే 21న  ప్రారంభమవుతుంది.

సౌదీ అరేబియాలో ఉన్న మక్కా ఇస్లాంను విశ్వసించే వారికి అత్యంత పవిత్రమైన ప్రదేశం. ప్రతీ ముస్లిం జీవితంలో ఒక్క సారైనా అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల నుంచి కోట్లాది మంది ముస్లింలు ఇక్కడికి చేరుకుంటారు. 
 

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!