బంగారం కొనేవారికి మంచి ఛాన్స్..! పసిడి ధరల పతనం, నేడు ఎంత తగ్గిందో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Nov 30, 2022, 9:59 AM IST
Highlights

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,753.25 డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా ఔన్స్‌కు 21.23 డాలర్లకు పడిపోయింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ ప్రకారం, కామెక్స్ గోల్డ్ కూడా పడిపోయింది.  US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,746.80 డాలర్లకి చేరుకుంది.

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో ప్రజలు బంగారం, వెండిని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకో శుభవార్త. నేడు పసిడి ధర దిగోచ్చింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.101 తగ్గి రూ.52,837కి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, గ్లోబల్ ట్రెండ్‌లో బలహీనత కారణంగా బంగారం ధరలు తగ్గాయి. ఒక వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు ఉదయం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,460 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర తగ్గడంతో ప్రజలు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

వెండి ధర కిలోకి రూ.61,744గా ఉంది. బంగారం ధరలు వారం రోజుల కనిష్ట స్థాయికి చేరాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,753.25 డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా ఔన్స్‌కు 21.23 డాలర్లకు పడిపోయింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ ప్రకారం, కామెక్స్ గోల్డ్ కూడా పడిపోయింది.  US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,746.80 డాలర్లకి చేరుకుంది.

బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.100 తగ్గగా, వెండి ధరలు మాత్రం మారలేదు. ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,880గా ఉండగా, వెండి కిలో రూ.61,400గా ఉంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో పది గ్రాముల బంగారం 24-క్యారెట్ ధర రూ. 52,880, 22-క్యారెట్ ధర రూ. 48,460. ఢిల్లీలో 24 క్యారెట్  బంగారం ధర రూ. 53,040, 22 క్యారెట్ ధర రూ. 48,610 వద్ద ట్రేడవుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,630,  22 క్యారెట్ ధర రూ.49,160గా ఉంది. 0019 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,750.00 వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,400. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో రూ.68,100గా ట్రేడవుతోంది.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా వరకు దూకణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి  9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయినప్పటికీ, దానితో  ఆభరణాలు  తయారు చేయడం సాధ్యం కాదు. 

click me!