పెరిగిన బంగారం, వెండి ధరలు... నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Dec 22, 2022, 10:31 AM IST
Highlights

ఢిల్లీలో 24 క్యారెట్ల  బంగారం ధర రూ. 54,820, 22 క్యారెట్ల  ధర రూ. 50,250 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాములు ధర  రూ.55,830, 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,180 వద్ద ట్రేడవుతోంది.

నేడు గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం , వెండి ధర మళ్ళీ పెరిగింది, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ. 540 పెరిగి  రూ. 54,650 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి నేడు కిలోకు రూ.70,100 వద్ద ట్రేడవుతోంది. దీని ధర రూ.800 పెరిగింది.

ఒక వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ ఇంకా పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర  రూ. 54,650, 22 క్యారెట్ల ధర రూ.50,100 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల  బంగారం ధర రూ. 54,820, 22 క్యారెట్ల  ధర రూ. 50,250 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాములు ధర  రూ.55,830, 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,180 వద్ద ట్రేడవుతోంది.

0225 GMT నాటికి స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్సుకు $1,818.40డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% పెరిగి $1,827.70డాలర్ల వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ 0.2% తగ్గింది.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో ఈరోజు కిలో వెండి ధర రూ.70,100 వద్ద ట్రేడవుతోంది. కాగా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.74,700గా ఉంది. స్పాట్ వెండి 0.2% పెరిగి $24.00కి, ప్లాటినం 0.9% పెరిగి $1,007.13కి, పల్లాడియం $1,692.38 వద్ద స్థిరపడింది.

బంగారం స్వచ్ఛతను చెక్ చేసేందుకు ఒక యాప్‌ను రూపొందించారు. ఈ 'బిఐఎస్ కేర్ యాప్' ద్వారా యూజర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ సాయంతో బంగారం స్వచ్ఛతను సరిచూసుకోవడమే కాకుండా దానిపై ఫిర్యాదులను కూడా నమోదు చేసుకోవచ్చు. వస్తువుల లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఇంకా హాల్‌మార్క్ నంబర్ తప్పు అని తేలితే కస్టమర్లు వెంటనే ఈ యాప్ నుండి ఫిర్యాదు చేయవచ్చు.  

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 999,

22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 916,

21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 875,

18 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 750,

14 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 585 ఉంటుంది.

click me!