పెళ్లిళ్ల సీజన్‌లో షాకిస్తున్న పసిడి, వెండి.. అల్ టైం హైకి ధరలు.. నేడు తులం ఎంతంటే..?

By asianet news teluguFirst Published Jan 23, 2023, 10:15 AM IST
Highlights

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ ఎగిశాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1930 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ $24.14 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  రూ.81.04 వద్ద ఉంది. 

కొత్త ఏడాదిలో మీరు బంగారం, వెండిని  కొనేందుకు ఆలోచిస్తున్నారా... ప్రస్తుతం, బంగారం వెండి ఆల్ టైమ్ హై రికార్డ్‌ ధరకి  చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ ఎగిశాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1930 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ $24.14 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  రూ.81.04 వద్ద ఉంది. 

జనవరి 23 అంటే సోమవారం నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,050 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,260. భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,270 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.52,500. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,110 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,350. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,110 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,350గా ఉంది.

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత 45 రోజుల్లో పసిడి ధర రూ.3500 పెరిగింది.

ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,060. హైదరాబాద్‌లో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,060. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,060. 

విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,060. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,300.  ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా శని, ఆదివారాల్లో రేట్లను జారీ చేయదని గమనించాలి. 

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అనేక ఇతర కారణాల వల్ల బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణాలు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

click me!