ఇంధన ధరల అప్ డేట్: 8 నెలలకు పైగా స్థిరంగా పెట్రోల్, డీజిల్.. పంప్‌కు వెళ్లే ముందు ధరలు తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Jan 23, 2023, 9:15 AM IST
Highlights

 గత ఏడాది మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన  తర్వాత,  మే 22న దేశవ్యాప్తంగా ఇంధన ధరలు చివరిసారిగా దిగోచ్చాయి. తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 14, 2022న పెట్రోల్ పై రూ. 5, డీజిల్‌ పై రూ. 3 చొప్పున వాల్యు ఆధారిత పన్ను ( వ్యాట్ ) తగ్గించింది. 

నేడు ఇంధన ధరలు వరుసగా 247వ రోజు సోమవారం అంటే జనవరి 23వ తేదీన  మారలేదు. గత ఏడాది మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన  తర్వాత,  మే 22న దేశవ్యాప్తంగా ఇంధన ధరలు చివరిసారిగా దిగోచ్చాయి. తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 14, 2022న పెట్రోల్ పై రూ. 5, డీజిల్‌ పై రూ. 3 చొప్పున వాల్యు ఆధారిత పన్ను ( వ్యాట్ ) తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.  

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర  రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0031 GMT వద్ద 46 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గి $87.17కి చేరుకుంది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 40 సెంట్లు పడిపోయి, 0.5 శాతం తగ్గి బ్యారెల్ $81.24కి చేరుకుంది.

ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

లక్నో లీటరు పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ.89.76
విశాఖపట్నం లీటరు పెట్రోల్ ధర రూ. 110.48, డీజిల్ ధర రూ.98.27
అహ్మదాబాద్ లీటరు పెట్రోల్ ధర రూ.96.63, డీజిల్ ధర రూ.92.38
హైదరాబాద్ లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
పాట్నా లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

click me!