పసిడి ప్రియులకు గుడ్ న్యూస్: తగ్గుతున్న బంగారం ధర! నేటి కొత్త ధరలు తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Nov 22, 2022, 9:45 AM IST
Highlights

నేడు మంగళవారం బంగారం, వెండి ధరలు  కాస్త దిగోచ్చాయి. ఈ రోజు పది గ్రాముల పసిడి (24 క్యారెట్లు) రూ.100 తగ్గి రూ. 52,920కి చేరాయి. వెండి ధరలు నిన్నటి ధరతో పోలిస్తే 1 కిలో  ధర రూ. 400 తగ్గి రూ.60,600 వద్ద ఉంది.

గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు అస్థిరతను నమోదు చేస్తున్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో అంటే సోమవారం మాత్రం బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం కనిపించింది. 

నేడు మంగళవారం బంగారం, వెండి ధరలు  కాస్త దిగోచ్చాయి. ఈ రోజు పది గ్రాముల పసిడి (24 క్యారెట్లు) రూ.100 తగ్గి రూ. 52,920కి చేరాయి. వెండి ధరలు నిన్నటి ధరతో పోలిస్తే 1 కిలో  ధర రూ. 400 తగ్గి రూ.60,600 వద్ద ఉంది.

ఒక నివేదిక  ప్రకారం, ఈరోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,500 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో పది గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 52,920, 22 క్యారెట్ల ధర రూ. 48,500గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,070,  22 క్యారెట్ల రూ.48,700గా ఉంది. చెన్నైలో బంగారం ధర రూ.53,670 (24 క్యారెట్లు), 22 క్యారెట్లకు  రూ.49,200 వద్ద ట్రేడవుతోంది.

0215 GMT నాటికి స్పాట్ బంగారం 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $1,743.07డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $1,744.50డాలర్లకి చేరుకుంది.

 ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 1 కిలో వెండి ధర రూ.60,600గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.66,500గా ట్రేడవుతోంది. వెండి ఔన్స్‌కు 1 శాతం పెరిగి 21.05 డాలర్లకు చేరుకుంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,920. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,920.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 మరియు 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో  9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయితే  ఆభరణాలుగా  తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.

click me!