సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి.. పండగ తరువాత మళ్ళీ ఎగిసిన ధరలు.. ఒకరోజే ఎంత పెరిగిందంటే..?

By asianet news teluguFirst Published Jan 17, 2023, 10:28 AM IST
Highlights

నేడు ఉదయం స్పాట్ సిల్వర్ 0.5% తగ్గి $24.27డాలర్లకి, ప్లాటినం 0.1% తగ్గి $1,061.77డాలర్లకి చేరుకోగా, పల్లాడియం 0.5% పెరిగి $1,759.67డాలర్లకి చేరుకుంది. మరోవైపు బంగారం ధరలు 17 జనవరి రోజున  హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో  పెరిగగా, వెండి ధరలు కూడా పెరిగాయి. 
 

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో  బంగారం ధరలు నేడు స్వల్ప మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,350. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 52,200. 

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,950 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.52,200గా ఉంది. నేడు ఉదయం స్పాట్ సిల్వర్ 0.5% తగ్గి $24.27డాలర్లకి, ప్లాటినం 0.1% తగ్గి $1,061.77డాలర్లకి చేరుకోగా, పల్లాడియం 0.5% పెరిగి $1,759.67డాలర్లకి చేరుకుంది.

పెళ్లిళ్ల  సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో అంటే కరోనా కాలంలో బంగారం ధర తులానికి  ఆల్ టైమ్ హై 56 వేలకు చేరుకుంది. ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జనవరి 16న బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర జీఎస్టీ మినహాయించి తులానికి రూ.56 వేల 883కి చేరింది. దీంతో బంగారం ధర మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుంది.

గత కొన్నేళ్లుగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా గత ఐదేళ్లలో పసిడి, వెండి ధర వేగంగా పెరిగింది. కాబట్టి బంగారం కొనడం క్రమంగా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది. మరోవైపు అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఇది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని దీంతో బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మరోవైపు బంగారం ధరలు 17 జనవరి రోజున  హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో  పెరిగగా, వెండి ధరలు కూడా పెరిగాయి. అయితే, ప్రముఖ నగరాల్లో  నేటి  ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెంపుతో రూ. 52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 210 పెంపుతో రూ. 56,950.

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 190 పెంపుతో రూ. 52,200. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పెంపుతో రూ. 56,950.   

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 75,800గా ఉంది.

click me!