పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం.. హైదరాబాద్‌లో 10గ్రాముల ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Jan 3, 2023, 10:04 AM IST
Highlights

ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1830 డాలర్లకు చేరింది. ఔన్సుకు స్పాట్ సిల్వర్ ధర $24 డాలర్ల పైన ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.735 వద్ద కొనసాగుతోంది.
 

ఈ రోజు జనవరి 3 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ. 55,160 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,530. మంగళవారం భారతదేశంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల ధరలలో స్వల్ప మార్పు కనిపించింది.

దీంతో భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 50,600. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,040 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 50,450. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,040 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1830 డాలర్లకు చేరింది. ఔన్సుకు స్పాట్ సిల్వర్ ధర $24 డాలర్ల పైన ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.735 వద్ద కొనసాగుతోంది. ఈ రోజు కువైట్‌ దేశంలో బంగారం ధర 24 క్యారెట్/గ్రామ్ కి KWD 18.100. బంగారం ధర 22 క్యారెట్/గ్రామ్ కి KWD 17.500.

మరోవైపు 03 జనవరి 2023న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు కాస్త పెరిగాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 

 ఆగస్ట్ 2020లో బంగారం ధర రికార్డు గరిష్ట స్థాయి  రూ.56,200ని తాకింది. "డాలర్ ఇండెక్స్ ట్రెండ్ 3 నెలలుగా బలహీనంగా ఉంది, 2022 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు 10% పెరిగాయి అని జతీన్ త్రివేది LKP సెక్యూరిటీస్‌లో VP రీసెర్చ్ అనలిస్ట్ చెప్పారు.

అయితే తాజాగా ధరల ప్రకారం బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 150 పతనంతో రూ. 50,450 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 160 పతనంతో రూ. 55,040గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే  22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ. 150 పతనంతో రూ. 50,460గా ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.160 పతనంతో రూ.55,040. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,040. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,040. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,500.

click me!