బంగారం, వెండి ధరలు పైపైకి.. రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్.. నేటి ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Nov 16, 2022, 9:19 AM IST
Highlights

ఈరోజు భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరలలో మార్పు చోటుచేసుకుంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.

భారతదేశంలో బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. పండగ సీజన్ తరువాత పడిపోయిన పసిడి ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) అలాగే 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర నేడు కూడా పెరిగింది. నవంబర్ 16 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 52,820 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 48,390.

మరోవైపు ఈరోజు భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరలలో మార్పు చోటుచేసుకుంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,300 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,950. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,150 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 47,800. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.47,800గా ఉంది.

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2% తగ్గి $21.48 డాలర్లకి చేరుకుంది. ప్లాటినం 0.3% పడిపోయి $1,011డాలర్లకి, పల్లాడియం $2,097 డాలర్ల వద్ద స్థిరపడింది. 0103 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,776.50 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి ఔన్సుకు $1,780.40 డాలర్ల వద్ద ఉంది.  ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.095 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.52,150గా ఉంది. అలాగే కేజి వెండి ధర రూ.68,500కు చేరింది. బంగారం ధర రానున్న రోజుల్లో కొత్త గరిష్ట స్థాయికి చేరవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

click me!