పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ రికార్డు హైకి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంత పెరిగిందంటే..?

By asianet news teluguFirst Published Jan 25, 2023, 9:02 AM IST
Highlights

ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది, దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా తగ్గుతుంది.  దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం చౌకగా మారడంతో రిటైల్ అమ్మకాలు కూడా పుంజుకోవచ్చు. 

న్యూఢిల్లీ: ఈరోజు ప్రారంభ ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను తాకాయి. బంగారాన్ని వినియోగిస్తున్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద  దేశం భారత్‌ బంగారం ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం ఇంకా బులియన్ మార్కెట్ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా నివేదికల ప్రకారం, కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించే ఆలోచనలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చని ఒక వార్తా సంస్థ నివేదించింది.

ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది, దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా తగ్గుతుంది.  దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం చౌకగా మారడంతో రిటైల్ అమ్మకాలు కూడా పుంజుకోవచ్చు. 

 ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1938 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు $23.68 డాలర్లకు చేరింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.638 వద్ద కొనసాగుతోంది. 

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు గత 45 రోజుల్లో రూ.3500 పెరిగింది. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెంపుతో రూ. 52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెంపుతో రూ. 57,490.  హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 350 పెంపుతో  రూ. 52,700. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 390 పెంపుతో రూ. 57,490.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,490. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,490. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000గా ఉంది.

click me!