Gold Rate: బంగారం ధర భారీగా పతనం..ఎంత తగ్గిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

By Krishna AdithyaFirst Published Apr 24, 2023, 11:27 AM IST
Highlights

బంగారం రేటు సోమవారం  స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు సోమవారం 110 రూపాయలు తగ్గాయి.  అక్షయ తృతీయ తర్వాత బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడ్డాయి దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ వినిపించినట్లు అయింది. 

బంగారం రేటు సోమవారం  స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.  హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 60,710గా నమోదైంది. శనివారం ఇదే బంగారం ధర 60,820గా నమోదైంది. అంటే సుమారు రూ. 110 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 10 గ్రాములకు గాను 55,650గా  నమోదయింది. ఇదిలా ఉంటే బంగారం ధరలు అక్షయ తృతీయ అనంతరం స్వల్పంగా తగుముఖం పట్టాయి. 

బంగారం ధరలు గరిష్ట స్థాయికి సమీపంలోనే ఉన్నాయి. 2023 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు గరిష్ట స్థాయి  దిశగా కదులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో పోల్చి చూసినట్లయితే  తులం బంగారం ధర  52 వేలుగా ఉంది.  అదే బంగారం ధర 2023 ఏప్రిల్ నెలలో 62 వేలకు చేరింది.  అంటే ఏడాది కాలంలో బంగారం ధర దాదాపు సుమారు పదివేల వరకు పెరిగింది. 

Latest Videos

 ఇక బంగారం ధర మనం గమనించినట్లయితే గడచిన ఐదు సంవత్సరాల్లో ఏకంగా రెండింతలు అయింది ఎందుకంటే 2018 సంవత్సరంలో  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 31 వేలుగా ఉంది.  అక్కడి నుంచి ప్రస్తుతం 62 వేలకు చేరింది అంటే గత ఐదు సంవత్సరాలలో బంగారం ధర రెట్టింపు అయింది. 

అయితే బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి కోవిడ్ ఒక కారణంగా చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తంగా కువైట్ కేసులు పెరగడం వల్ల ప్రపంచ పారిశ్రామిక ప్రగతి పడకేసింది ఫలితంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ఫలితంగా పెట్టుబడిదారులంతా బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావించి తమ పెట్టుబడులను అన్ని కూడా బంగారం వైపే తరలించారు.  ఫలితంగా బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడి రిటైల్ మార్కెట్లో కూడా భారీగా పెరిగింది. 

Gold: బంగారం తరుగు, మజూరీ అంటే ఏంటి..నగల షాపుల వారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో తెలుసుకోండి..

 ప్రస్తుతం బంగారం సంక్షోభానికి అమెరికాలో నెలకొన్నటువంటి బ్యాంకింగ్ సంక్షోభం కూడా ఒక కారణమని చెప్పవచ్చు.  అలాగే డాలర్ విలువ కూడా నెమ్మదిగా బలహీనపడుతోంది దీంతో మధుపరులు అమెరికా బాండ్లల్లో కన్నా కూడా గోల్డ్ మార్కెట్ లోనే ఎక్కువ రాబడి ఉందని భావించి తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు.  ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతుంది. 

Gold Rate: బంగారం ధర భారీగా పతనం అయ్యే అవకాశం..తులం రూ. 50 వేలకు పడిపోయే చాన్స్...కారణాలు ఇవే..

అయితే పెరుగుతున్న బంగారం నుంచి మీరు లాభాలను ఒడిసిపెట్టాలని అనుకుంటున్నారా.  బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే కేవలం నగలు కొంటే సరిపోదు దానికి వేరే మార్గం ఉంది.  ముఖ్యంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్,  సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు బంగారం నుంచి మంచి రాబడిని పొందే వీలుంది. బంగారాన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి ఆధారం పొందే అవకాశం ఉంది ఈ ఫండ్స్ స్టాక్ ఎక్స్చేంజ్  తరహాలో ట్రేడ్ అవుతుంటాయి.  బంగారం హెచ్చుతగ్గులకు లోనైతే ఇవి ప్రభావానికి లోనవుతుంటాయి పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో మీకు పెట్టుబడులకు అనుమతిని ఇస్తుంది. 

click me!