బంగారం, వెండి ధరల అప్ డేట్: నిన్నటితో పోల్చితే 10 గ్రాములకి తగ్గిందా పెరిగిందా తెలుసుకోండి?

By asianet news teluguFirst Published Nov 26, 2022, 9:59 AM IST
Highlights

నవంబర్ 26 శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,660 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 48,240గా ఉంది. ఈరోజు 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు 50 రూపాయలు తగ్గాయి.

గడిచిన వారం మొదట్లో బంగారం ధరలు కాస్త తగ్గాగ తర్వాత కోలుకోవడంతో వారంలో దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ శుక్రవారం 10 గ్రాముల స్థాయిలకు  రూ.131 తగ్గి రూ.52,540 వద్ద ముగిసింది, అయితే స్పాట్ బంగారం ధర ఔన్సు స్థాయికి $1,754 డాలర్ల వద్ద ముగిసింది. కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అత్యధిక ఇన్ఫెక్షన్ల తర్వాత చైనా కోవిడ్ పరిమితులను మళ్లీ విధించింది, దీంతో ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ కన్జ్యూమర్ గ్రోత్ అవుట్ లుక్ అండ్  పసిడి డిమాండ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది అని అన్నారు.

నవంబర్ 26 శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,660 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 48,240గా ఉంది. ఈరోజు 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు 50 రూపాయలు తగ్గాయి.

భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పసిడి ధరలలో మార్పులు నమోదు చేసింది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.53,840 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.47,350గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.53,120 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,700. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ. 52,970 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 48,550. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,970 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,550గా ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.52,970గాఉంది.పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికి వెండి ధరలు కాస్త దిగోచ్చాయి. నేడు కిలో వెండి ధర సుమారు రూ. 200 తగ్గింది. దీంతో వెండి ధర రూ.68,000కి చేరింది. 

 నేడు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1754 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు $21.46 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.81 వద్ద ఉంది.
 

click me!