todays gold price:తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రా పసిడి ధర ఎంతంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Apr 28, 2022, 09:19 AM ISTUpdated : Apr 28, 2022, 09:21 AM IST
todays gold price:తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రా పసిడి ధర ఎంతంటే..?

సారాంశం

గత 24 గంటల్లో 10 గ్రాముల 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గింది. నిన్న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 51,990 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 47,630.

 భారత్‌లో బంగారం ధర పతనం కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మరికొన్ని రాష్ట్రాల్లో స్థిరంగా  కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 28 నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 51,750 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 47,400గా ఉంది.

గత 24 గంటల్లో 10 గ్రాముల 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గింది. నిన్న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 51,990 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 47,630.

గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.53,280 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.48,840గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,960 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 48,450. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,860 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 48,450. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,860 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.48,450గా ఉంది.

 నగల తయారీలో  వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.48,450 వద్ద స్థిరంగా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పు లేదు. ఇక్కడ ఒక్క గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ.4,845గా ఉంది.

 పెట్టుబడుల్లో వినియోగించే 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.52,860 వద్ద స్థిరంగా ఉంది.  నిన్నటితో పోల్చితే  ధరలో మార్పులేదు. ప్రస్తుతం ఒక్క గ్రాము  స్వచ్ఛమైన బంగారం ధర రూ.5,286కి  అందుబాటులో ఉంది. హైదరాబాద్‌ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.69,800గా ఉంది.  నిన్నటితో పోల్చితే రూ.200 తగ్గింది. తులం వెండి ధర రూ.698గా ఉంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !