వామ్మో... బంగారం ధర మళ్లీ భారీగా పెరిగింది

By telugu teamFirst Published Aug 17, 2019, 12:42 PM IST
Highlights

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.48 శాతం తగ్గుదలతో 1,523.80 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.74 శాతం క్షీణతతో 17.08 డాలర్లకు తగ్గింది. 
 

బంగారం ధర రోజు రోజుకీ చుక్కలు చూపెడుతోంది. మొన్నామధ్య ఒకరోజు కాస్త బంగారం ధర తగ్గినట్లే తగ్గి... మళ్లీ భారీగా పెరిగింది. ఒక్కరోజే రూ.2వేల పైనే పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,400 పెరిగింది. దీంతో.. పది గ్రాముల బంగారం ధర రూ.39,400కు చేరింది. 

అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జ్యువెలర్స్, రిటైర్ల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధర ఆకాశాన్నంటుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 పెరుగుదలతో రూ.36,120కు చేరింది. బంగారం ధర భారీగా పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో పురోగతి లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. 

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.48 శాతం తగ్గుదలతో 1,523.80 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.74 శాతం క్షీణతతో 17.08 డాలర్లకు తగ్గింది. 

click me!