గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర

By telugu teamFirst Published Aug 15, 2019, 4:18 PM IST
Highlights

అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జ్యెవలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో బంగారం ధర కాస్త తగ్గివచ్చిందని బులియన్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. నిన్న, మొన్నటి వరకు ఆకాశాన్నంటిన బంగారం ధర నేడు కాస్త తగ్గుముఖం పట్టింది.  దీంతో బంగారం కొనుగోలు దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,490 తగ్గింది. దీంతో... పది గ్రాముల పసిడి ధర రూ.37వేలకు చేరుకుంది.

అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జ్యెవలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో బంగారం ధర కాస్త తగ్గివచ్చిందని బులియన్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా... 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.360 మాత్రమే తగ్గింది. దీంతో... పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.35,760కు చేరుకుంది. బంగారం ధర స్వల్పంగా తగ్గగా... వెండి ధర మాత్రం స్థిరంగా ఉండటం గమనార్హం.  కేజీ వెండి ధర రూ.47,265గా నిలకడగా ఉంది. పరిశ్రమలు, నాణేల తయారీ సంస్థల నుచి డిమాండ్ కారణంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం ధర 0.29శాతం పెరగడంతో 1,532.15డాలర్లకు చేరింది. అదే సమయంలో ఔన్సు వెండి ధర 0.28శాతం పెరిగి 17.32డాలర్లకు చేరుకుంది. 

click me!