ఆకాశానికి బంగారం, వెండి ధరలు.. నేడు అల్ టైం హైకి 10 గ్రాముల పసిడి ధర.. పెళ్లిళ్ల సీజన్‌కి ఎంత పెరగవచ్చాంటే..

Published : Jan 16, 2023, 10:46 AM ISTUpdated : Jan 16, 2023, 10:49 AM IST
ఆకాశానికి బంగారం, వెండి ధరలు..  నేడు అల్ టైం హైకి 10 గ్రాముల పసిడి ధర.. పెళ్లిళ్ల సీజన్‌కి ఎంత పెరగవచ్చాంటే..

సారాంశం

ప్రస్తుతం, బంగారం ధర ఆల్ టైమ్ హై రికార్డ్‌లో అమ్ముడవుతోంది. జనవరి 15న మకర సంక్రాంతితో దేశంలో మరోసారి పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు 16 జనవరి 2023న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో పసిడి  ధరలు పెరగగా, వెండి ధరలు తగ్గాయి.  

భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు నేడు  సరికొత్త గరిష్టా స్థాయిని తాకింది. MCXలో గోల్డ్ ఫ్యూచర్స్ 0.35% పెరిగి 10 గ్రాములకు రూ.56517కి చేరుకుంది,  సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు  0.75% పెరిగి  కేజీకి రూ.70,000 వద్ద స్థిరపడింది.  గ్లోబల్ మార్కెట్లలో, స్పాట్ బంగారం 0.3% పెరిగి ఔన్సుకు తొమ్మిది నెలల గరిష్ట స్థాయి $1,926.07కి చేరుకుంది.   ప్రస్తుతం, బంగారం ధర ఆల్ టైమ్ హై రికార్డ్‌లో అమ్ముడవుతోంది. జనవరి 15న మకర సంక్రాంతితో దేశంలో మరోసారి పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

నేడు 16 జనవరి 2023న  ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,160, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,990 వద్ద ఉంది.  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,970గా ఉంది. 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,790. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,010, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,740. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.56,740. 

వెండి ధరలు చూస్తే  కోల్‌కతా, ముంబైలలో కేజీ ధ్జర  రూ.72,750, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 74,000.

ఈరోజు 16 జనవరి 2023న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో పసిడి  ధరలు పెరగగా, వెండి ధరలు తగ్గాయి.  ఒక నివేదిక ప్రకారం బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెంపుతో రూ. 52,010, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 పెంపుతో రూ. 56,740గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు  రూ. 10 పెంపుతో  రూ. 52,010,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,740గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,010, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,740. విశాఖపట్నంలో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,010, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,740. 

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000.

 ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా శని, ఆదివారాల్లో రేట్లను జారీ చేయదని గమనించాలి.  మీరు ఇప్పుడు బంగారం స్వచ్ఛతను చెక్ చేయాలనుకుంటే, దీని కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. BIS కేర్ యాప్‌తో కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా చేయవచ్చు.

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !