ఒక నెలలో గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు.. దీపావళికి మరింత పెరగనున్న పసిడి..?

By asianet news teluguFirst Published Oct 6, 2022, 10:45 AM IST
Highlights

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ బుధవారం నాడు 0.18% పెరిగి 946.34 టన్నులకు చేరుకుంది.

అంతర్జాతీయ సంకేతాలను ట్రాక్ చేస్తూ నేడు భారతీయ మార్కెట్లలో బంగారం, వెండి  ధర పెరిగింది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.4% పెరిగి 10 గ్రాములకు ఒక నెల గరిష్ట స్థాయి రూ.51,848కి చేరాయి. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 1.2% పెరిగి రూ.61,525కి చేరుకుంది.  స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్సుకు $1,719.19 వద్ద ఉంది.  స్పాట్ వెండి అయితే ఔన్స్‌కు 0.3% తగ్గి $20.64కి చేరుకుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ బుధవారం నాడు 0.18% పెరిగి 946.34 టన్నులకు చేరుకుంది.

ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,660 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,760 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 52,260, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ. 47,910 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.52,760,  22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360గా ట్రేడవుతోంది. హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల  ధర రూ.47,750.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో 1 కిలో వెండి రూ.61,500 వద్ద ట్రేడవుతోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.67,000గా ఉంది. అయితే, పైన పేర్కొన్న రేట్లు GST, TCS ఇతర లెవీలు ఉండవని గమనించాలి. ఖచ్చితమైన ధరల కోసం, మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.  

click me!