తగ్గిన బంగారం, వెండి ధరలు

By ramya neerukondaFirst Published Sep 14, 2018, 4:35 PM IST
Highlights

ఇక దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.200 తగ్గి.. పదిగ్రాముల బంగారం రూ.31,400గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,250కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధర ఇప్పుడు దిగివచ్చింది. శుక్రవారం నాటి బులియన్‌ మార్కెట్లో రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 31,400 పలికింది. ఇక వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 250 తగ్గింది. దీంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 37,650గా ఉంది.

అంతర్జాతీయంగా పసిడిలో పెట్టుబడులు పెరిగినప్పటికీ దేశీయంగా నగల వ్యాపారులు, రిటైలర్లు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వల్లే ఈ లోహాల ధరలు పడిపోయినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో 0.61శాతం పెరిగి ఔన్సు బంగారం 1,208.20 అమెరికన్‌ డాలర్లు పలికింది. వెండి కూడా 0.78శాతం పెరిగి ఔన్సు ధర 14.25 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

ఇక దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.200 తగ్గి.. పదిగ్రాముల బంగారం రూ.31,400గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,250కి చేరింది.

click me!