
నేడు జనవరి 30 సోమవారం నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,190 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,380. ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు పై పెట్టుబడిదారులు వేచి చూస్తుండటంతో సోమవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 0259 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,926.65 డాలర్ల వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% తగ్గి $1,925.50 డాలర్ల వద్ద ఉన్నాయి.
ఇతర విలువైన లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.4% పెరిగి $23.65డాలర్లకి, ప్లాటినం 0.2% పెరిగి $1,014.53డాలర్లకి, పల్లాడియం 1.2% పెరిగి $1,638.45డాలర్లకి చేరుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.603 వద్ద స్థిరంగా ఉంది.
భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,420 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 52,650. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,270 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 52,500. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,270 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,500గా ఉంది.
నేడు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో పసిడి ధరలు కాస్త పెరిగాయి. బంగారం ధరలు గత 45 రోజుల్లో రూ.3500 వరకు ఎగిసింది. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,440.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,440. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,440. విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,440. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,200. స్థానికంగా ఉండే పన్నులు, మేకింగ్ చార్జీలను బట్టి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
“గత ఏడాది జూలై 2022లో ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15%కి పెంచింది. దీంతో ఒక విధంగా దిగుమతులు పెద్ద ఎత్తున పడిపోయాయి. క్యాలెండర్ ఇయర్ 2022 దిగుమతుల పరంగా క్షీణతను చూసింది- ఇది ఎక్కువగా బంగారం ధరలు పెరగడం, దిగుమతి సుంకం పెరుగుదల కారణంగా ఉంది. దేశీయంగా బంగారం ధరలు రూ.58,000-రూ.59,000 స్థాయిని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. ”అని కామా జ్యువెలరీ ఎండి కొలిన్ షా అన్నారు.