పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. ఇక్కడ లీటరు ధర రూ.35 వరకు పెంపు.. బంకుకు వెళ్ళేముందు తెలుసుకోండి..

Published : Jan 30, 2023, 09:16 AM ISTUpdated : Jan 30, 2023, 09:20 AM IST
పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు..  ఇక్కడ లీటరు ధర రూ.35 వరకు పెంపు.. బంకుకు వెళ్ళేముందు తెలుసుకోండి..

సారాంశం

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరల సవరణను ప్రకటిస్తాయి. అయితే,  పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం, జనవరి 30న స్థిరంగా ఉన్నాయి. 

న్యూఢిల్లీ :  పాకిస్థాన్ దేశం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.35 వరకు పెంచిన తరుణంలో..భారతీయ ఆయిల్ మార్కెట్ కంపెనీలు మాత్రం ఇంధన ధరలను యథాతథంగా ఉంచాయి. ఇరాన్‌లో డ్రోన్ దాడి తర్వాత ఉద్రిక్తతలకు తోడుగా ఆసియా వాణిజ్యంలో ఆయిల్ ధరలు ఎగిసినప్పటికీ, భారతీయ ఇంధన వినియోగదారులకు ఉపశమనం కొనసాగింది.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరల సవరణను ప్రకటిస్తాయి. అయితే,  పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం, జనవరి 30న స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్నీ మెట్రోల్ నగరాలలో ఇప్పుడు ఏడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు  లేదు .

30 జనవరి 2023న పెట్రోల్, డీజిల్ ధరలు
తాజా ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72, డీజిల్ ధర రూ.89.62, ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర  రూ.106.31, లీటర్ డీజిల్‌ ధర  రూ.94.27. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ బెంగళూరులో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర లీటరుకు రూ. 87.89గా ఉంది.

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
నోయిడా
పెట్రోలు ధర  లీటరు రూ.96.79
డీజిల్ ధర  లీటరుకు రూ.89.96

గుర్గావ్
పెట్రోలు ధర  లీటరు రూ.97.18
డీజిల్ ధర లీటరుకు రూ.90.05

చండీగఢ్
పెట్రోలు ధర  లీటరు రూ.96.20
డీజిల్ ధర  లీటరుకు రూ.84.26

చెన్నై
పెట్రోలు ధర లీటరుకు రూ.102.63
డీజిల్ ధర  లీటరుకు రూ.94.24

కోల్‌కతా
పెట్రోలు ధర  లీటరుకు రూ.106.03
డీజిల్ ధర  రూ. 92.76

లక్నో
పెట్రోలు ధర  లీటరు రూ.96.62
డీజిల్ ధర  లీటరుకు రూ.89.81

హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

గత ఏడాది వేసవిలో అంటే మే 2022లో పెట్రోల్, డీజిల్ ధరలను చివరిసారిగా సవరించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిన ఒక రోజు తర్వాత మే 22న దేశవ్యాప్తంగా ధరలు దిగోచ్చాయి.

క్రూడాయిల్ చమురు గురించి మాట్లాడితే  గత 24 గంటల్లో ధరలు కూడా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 87.17 డాలర్లకు పెరిగింది. WTI ధర కూడా బ్యారెల్‌కు 80.14 డాలర్లకు చేరింది.

PREV
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే