Gold Rate: రాసిపెట్టుకోండి..బంగారం ధర రూ. 75000 దాటడం ఖాయం...ఒక్క రోజులో పసిడి ఎంత పెరిగిందో తెలిస్తే షాకే..

By Krishna AdithyaFirst Published May 4, 2023, 11:31 AM IST
Highlights

ఈ సంవత్సరం బంగారం వేగంగా దూసుకెళ్తోంది.  ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగారాన్ని ఎడా పెడా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిడి ధర అమాంతం పెరిగింది.  మన దేశం మార్కెట్లో అతి త్వరలోనే పసిడి ధర 75000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

గురువారం బంగారం ధర మరోసారి పెరిగింది. MCX ఎక్స్ఛేంజ్‌లో, జూన్ 5, 2023న డెలివరీ చేయడానికి బంగారం 0.41 శాతం లేదా రూ. 246 పెరిగి 10 గ్రాములకు రూ.60,010 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, ఆగస్టు 4, 2023న డెలివరీ చేయాల్సిన బంగారం ధర 0.36 శాతం లేదా రూ. 214 పెరిగి 10 గ్రాములకు రూ.60,400 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు కూడా పెరిగాయి. అదే సమయంలో అంతర్జాతీయంగా వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది.   దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి కిలో రూ.75,000 దిగువన ట్రేడవుతోంది. 

బంగారం కాకుండా ఇతర వెండి దేశీయ ఫ్యూచర్స్ ధరలు మంగళవారం సాయంత్రం తగ్గాయి. మంగళవారం సాయంత్రం MCX ఎక్స్ఛేంజ్‌లో జూలై 5, 2023న డెలివరీ కోసం వెండి ధర 0.74 శాతం లేదా రూ. 558 తగ్గి కిలోకు రూ. 74,901 వద్ద ట్రేడవుతోంది.

గురువారం అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. Comex లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.28 శాతం పెరిగి ఔన్సు అంటే 31 గ్రాములు ధర  1997.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, బంగారం స్పాట్ ధర 0.24 శాతం పెరుగుదలతో ఔన్స్ 1987.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు బంగారం ధరలు అటు రిటైల్ మార్కెట్లో కూడా భారీగా పెరిగాయి ముఖ్యంగా భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో ఏకంగా రూ. 62,180 పలుకుతోంది. అదే సమయంలో నిన్నటి ధరతో పోల్చితే నేడు ఏకంగా 540 రూపాయలు పెరిగింది.  బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,640 రూపాయలుగా ఉంది. ఇక  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,000 గా నమోదైంది. 

ఈ సంవత్సరం బంగారం రాకెట్‌గా మారబోతోంది, ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి దీంతో పసిడి ధర అమాంతం పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర అమాంతం పెరిగింది. అంతేకాదు బంగారం ధర పెరుగుదల వెనుక అమెరికన్ బ్యాంకింగ్ సంక్షోభం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఇప్పటికే ఫస్ట్ రిపబ్లిక్ అండ్ బ్యాంకు దివాలా తీయడంతో.  పెట్టు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫలితంగా పసిడి ధరలు ఆకాశాన్ని కాకుతున్నాయి.  అతి త్వరలోనే బంగారం ధర 75 వేలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

click me!