
భారతదేశంలో గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్లు/ 22 క్యారెట్‌లకు రూ. 560 పెంపు జరిగింది.
శనివారం (25 మార్చి) నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,650 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) పసిడి ధర రూ. 54,640.
భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,150 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,000 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,000. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000గా ఉంది.
భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 60,000 కాగా 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000.
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500కు చేరుకుంది.
బంగారం స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలి
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌లపై 916, 21 క్యారెట్‌లపై 875, 18 క్యారెట్‌లపై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్ల పసిడిని కూడా ఉపయోగిస్తున్నారు.
22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటో తెలుసా?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.