
పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి వారం మొదటి రోజైనటువంటి సోమవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను ఏకంగా 3500 రూపాయలు చౌకగా లభిస్తోంది. ఇది ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చి చూస్తే భారీగా తగ్గినట్టు మనం గమనించవచ్చు. పసిడి ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి గడచిన రెండు వారాలుగా పతనమవుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో పసిడి ప్రియులు జోరుగా బంగారం షాపింగ్ చేస్తున్నారు.
ఈరోజు, 27 ఫిబ్రవరి 2023న, బంగారం, వెండి కొత్త ధరలు బులియన్ మార్కెట్‌లో విడుదల చేశారు. ఈరోజు బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాములకు రూ. 160 తక్కువ ధరతో ప్రారంభం అయ్యింది, వెండి కిలోకు రూ. 700 తక్కువ ధరతో ప్రారంభమైంది. 22 క్యారెట్ల బంగారం ధర గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,650/-, ముంబై బులియన్ మార్కెట్ రూ.51,500/-, హైదరాబాద్ బులియన్ మార్కెట్ రూ.51,500/- చెన్నై బులియన్ మార్కెట్‌లో రూ. రూ.52,100/- ట్రేడవుతోంది
24 క్యారెట్ల బంగారం ధర గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,130/-, ముంబై బులియన్ మార్కెట్ రూ.56,180/-, హైదరాబాద్ బులియన్ మార్కెట్ రూ.56,180/-, చెన్నై బులియన్ మార్కెట్‌లో రూ. రూ.56,140/- నడుస్తోంది
వెండి ధర గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 1 కిలోల వెండి ధర రూ.66,800/-గా ఉంది, ముంబై బులియన్ మార్కెట్ లో కూడా వెండి ధర రూ.66,800/-గా ఉంది, చెన్నై బులియన్‌లో వెండి ధర రూ.66,800/-గా ఉంది.
మరో మరోవైపు బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి దీని వెనుక కారణాలు లేకపోలేదు ముఖ్యంగా డాలర్ విలువ భారీగా బలం పొంచుకోవడం కూడా బంగారం ధర తగ్గడానికి దోహదపడుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే డాలర్ బలం ఎంత పుంజుకుంటే బంగారం ధర కూడా అంత తగ్గుతుందని, బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఔన్స్ బంగారం ధర 1800 డాలర్లు దిగువన ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అటు రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పతనం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.